పశ్చిమ గోదావరి జిల్లాలో తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

ప.గో. జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని కావలి గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో శుక్రవారం తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరితో కలిసి భోగి మంటలు వెలిగించారు. భోగి మంటల వెలుగు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, తదితరులు ఉన్నారు.