ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సందర్శనీయ ప్రాంతాలు పర్యటకులతో కళకళలాడుతున్నాయి. కరోనా తీవ్రత తగ్గడంతో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన రామప్ప దేవాలయం, వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, లక్నవరం, పాకాల చెరువులు సహా పలు ప్రాంతాలు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. అయితే సౌకర్యాల లేమి తమను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తోందని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తగిన ఏర్పాట్లు చేయాలంటున్నారు.