ములుగు: అడవిని పరిరక్షించాలి

ములుగు జిల్లాలోని మేడారం పరిసర ప్రాంతాల్లోని అడవులను సంరక్షించాలని మేడారం అటవీశాఖ రేంజ్ అధికారి గౌతమ్ రెడ్డి అన్నారు. మేడారంలోని కన్నెపల్లి స్థూపం వద్ద వెదురు బొంగు విక్రయం కోసం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అడవుల సస్యరక్షణలో భాగంగా జాతరలో భక్తుల సౌకర్యార్థం దుకాణదారులకు వెదురు విక్రయించేందుకు ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు.