వరంగల్ : ములుగు జిల్లాను సమ్మక్క- సారలమ్మ జిల్లాగా ప్రకటించాలి’

ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షులు ముంజాల బిక్షపతి గౌడ్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాను సమ్మక్క- సారలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని ఫిబ్రవరి 8-11 వరకు పాదయాత్రకు మద్దతు తెలపాలని ఎమ్మెల్యే సీతక్కను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సంపూర్ణ మద్దతు ఇస్తానని సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.