వరంగల్: రోజురోజుకూ ఎగబాకుతున్న మిర్చి ధరలు

అకాల వర్షాలు, తెగుళ్ళను తట్టుకొని వచ్చిన మిర్చి దిగుబడికి ధర ఊహించని విధంగా అమాంతం పెరిగిపోతోంది. గతంలో పలికిన ధర రికార్డులను తిరగ రాసేస్తుంది. వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో దేశవాళీ మిర్చి క్వింటాకు రూ.35వేలు పలికి సరికొత్త రికార్డు నెలకొల్పింది. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరుకు చెందిన రైతు రాజేశ్వర్ తీసుకొచ్చిన 40 బస్తాల మిర్చిని రూ.35వేల చొప్పున ఒక అడితి వ్యాపారి కొనుగోలు చేశారు.