నేటి(శనివారం) నుంచి మేడారం జాతరకు వరంగల్ బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించనున్నారు. ప్రతీ రోజు ఉదయం 6:30, 7:00, 7:20, 7:40 గంటలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అమ్మవార్ల గద్దెల వరకు బస్సులు వెళ్తాయని తెలిపారు. ఇప్పటి వరకు హన్మకొండ బస్టాండ్ నుంచి మాత్రమే ఆర్టీసీ సేవలందిస్తుండగా ఇక వరంగల్ నుంచి భక్తులను తరలించనున్నారు.