బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ ని నాని హోస్ట్ చేసి ఉంటే..?

-

హల్లో ఫ్రెండ్స్.. ఇవాళ మీకు ఓ ముచ్చట చెబుతాను వింటారా? ఏం ముచ్చటో తెలుసా? మీకు కూడా ఇష్టమైనదే. అదే.. బిగ్ బాస్ ముచ్చట. బిగ్ బాస్ ముచ్చటే ఎందుకు చెప్పాలనిపిస్తున్నదంటే.. బిగ్ బాస్ సీజన్ వన్ ను హోస్ట్ చేసిన ఎన్టీఆర్, సీజన్ 2 ను హోస్ట్ చేస్తున్న నానిపై వచ్చే కామెంట్ల వల్ల. అవును.. సోషల్ మీడియాలో వీళ్లిద్దరిపై చాలా కామెంట్స్ వస్తున్నాయి. అయితే.. నెటిజన్లు మాత్రం ఓ విషయాన్ని మరిచిపోయారు. అసలు బిగ్ బాస్ హోస్టుగా తారక్ బెస్టా.. నాని బెస్టా కాదు మనం మాట్లాడుకునేది. అసలు.. హోస్టుల వివాదం ఎందుకు తెరమీదికి వస్తున్నదో.. దానిపైన క్లారిటీ రావాలి. అందుకే.. మీకు ఇప్పుడు ఈ బిగ్ బాస్ ముచ్చట చెప్పబోతున్నాను. ఆర్ యూ రెడీ.. కమాన్.. లెట్స్ బిగిన్.

తెలుగులో వచ్చిన బిగ్ బాస్ ఓ సంచలనం. ఇప్పటి వరకు తెలుగు బుల్లి తెరపై ఇటువంటి రియాల్టీ షో ఇంతవరకూ రాలేదు. దీంతో తెలుగు ప్రేక్షకులు ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. బిగ్ బాస్ మొదటగా హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ప్రారంభమయింది. తర్వాత వేరే భాషల్లనూ స్టార్టయింది. చివరకు తెలుగు భాషకు చేరింది.

అయితే.. బిగ్ బాస్ సీజన్ వన్ దాదాపు 70 రోజులు సాగింది. ఓకే.. బిగ్ బాస్ సీజన్ వన్ సూపర్ సక్సెస్ అయింది. టీఆర్పీ రేటింగ్స్ కూడా అదిరిపోయాయి. కాని.. ఇక్కడ మరో ఇంటరెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. హోస్ట్. సీజన్ వన్ హోస్ట్ గా ఎన్టీఆర్ సరిగ్గా సరిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన బిగ్ బాస్ స్టేజీపై నటించలేదు. జీవించాడు. దీంతో ప్రేక్షకులు, బిగ్ బాస్ కంటెస్టంట్లు కూడా హోస్ట్ తో ఓ కనెక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. బిగ్ బాస్ తొలి సీజన్ కావడంతో ఒక హోస్ట్ అంటే ఇలాగే ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకున్నారు.

Bigg boss season 2 host nani

ఇప్పుడు సెకండ్ సీజన్ కు నాని హోస్ట్ గా వచ్చాడు. దీంతో ప్రేక్షకులు ఇదివరకే కనెక్ట్ అయిన ఎన్టీఆర్ తో నానిని పోల్చేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులకూ ఒకే రకమైన మెంటాలిటీ ఉండదు.. ఎవరి టాలెంట్ వారిది.. ఎవరి అనుభవాలు వాళ్లవి. ఒకరిని మరొకరితో అస్సలు పోల్చలేము. మరి.. తెలుగు ప్రేక్షకులు ఎన్టీఆర్ ను, నానిని ఎందుకు పోల్చుతున్నట్టు?

సరే.. ఒకవేళ సీజన్ వన్ ని నాని హోస్ట్ చేసి ఉంటే.. సీజన్ టూ ను ఎన్టీఆర్ హోస్ట్ చేసి ఉంటే ఏం చేసేవారు. ఎవరి స్కిల్స్ వారివి. నానిలా ఎన్టీఆర్ చేయట్లేడని అనేవారా? లేదంటే నాని కన్నా ఎన్టీఆర్ బాగా చేస్తున్నాడని అనేవారా? అది ప్రేక్షకుడు షోను ఆస్వాదించే దాన్ని బట్టి ఉంటుంది. అందుకే.. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు.. ఎవరినీ అతిగా ఊహించుకోకూడదు.

ఇక్కడ ఎవరూ తక్కువ కాదు. ఎవరూ ఎక్కువ కాదు. ఇద్దరికీ టాలెంట్ ఉంది కాబట్టే తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా చలామణి అవుతున్నారు. అంతే కాని.. ఒకరిని మరొకరితో పోల్చడం కరెక్ట్ కాదు. చెప్పలేం. ఎన్టీఆర్ లో ఉన్న కొన్ని స్కిల్స్ నానిలో లేకపోవచ్చు. నానిలో ఉన్న కొన్ని స్కిల్స్ ఎన్టీఆర్ లో లేకపోవచ్చు. కాని.. ఇక్కడ వాళ్లు షోను సక్సెస్ ఫుల్ గా నడిపించారా? ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేశారా? లేదా? అనేదే చూడాలి. ఓ ప్రేక్షకుడు టీవీ ఎందుకు చూస్తాడు. కాస్త ఎంటర్ టైన్ అవుదామని. అది ప్రేక్షకుడికి దొరికితే.. హోస్ట్ గా ఎవరున్నా సక్సెస్ అయినట్టే. నిర్వాహకులు సక్సెస్ అయినట్టే. కంటెస్టంట్లు, ఇతర సిబ్బంది సక్సెస్ అయినట్టే.

అంతే కాని.. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ, హోస్ట్ గా ఈయన పనికిరాడు.. ఈయనే పనికొస్తాడు.. అంటూ సోషల్ మీడియాలో వైరలయ్యే న్యూస్ లను నమ్మకండి. మీమ్మల్ని బిగ్ బాస్ ఎంటర్ టైన్ చేస్తుందా జస్ట్.. షోను ఎంజాయ్ చేయండి. లేదంటే చానెల్ మార్చేయండి బాస్. అంతే.. ఏమంటరు. గిదే ముచ్చట చెబుదామని వచ్చిన.

గమనిక: నేను చెప్పిన ముచ్చట మీకు నచ్చితే ఇంకో ముచ్చట కోసం ఎదురు చూడండి. నచ్చకపోతే క్షమించండి. అసలు అర్థమే తప్పయితే మన్నించండి. (ఏదో సరదాకు)

Read more RELATED
Recommended to you

Latest news