ఎడిట్ నోట్: నిర్మల హేళన సరికాదు.!

-

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి..అందులోనూ తెలుంగింటి కోడలు..అయినా సరే తెలుగువారినే అవమానించేలా మాట్లాడటం. తెలుగింటి కోడలు అయి ఉండి తెలుగు వాళ్ళనే అవమానిస్తే..ఇక ఢిల్లీలో తెలుగు వాళ్ళని మిగతా వాళ్ళు గౌరవిస్తారా? అసలే మన తెలుగు వాళ్ళని పార్లమెంట్‌లో పెద్దగా గౌరవం ఉండదని, పెద్దగా హిందీ మాట్లాడటం రాదని..ఉత్తర భారతదేశం నేతలు అప్పుడప్పుడు అవమానించిన ఘటనలు చాలానే ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తగ్గాయి..అలాగే మన తెలుగు ఎంపీలు హిందీ, ఇంగ్లీష్ బాషలని బాగానే మాట్లాడుతున్నారు.

 

అయితే ఇంకా కొందరికి ఆ బాషలపై పట్టు లేదు. అదే ఇప్పుడు టి‌పి‌సి‌సి అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డిని అవమానించడానికి కారణమైంది. విపక్ష ఎంపీగా ఉన్న రేవంత్…దేశ ఆర్ధిక వ్యవస్థకు సంబంధించి ఓ ప్రశ్నని సంధించారు. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు..ఇదే మోదీ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.66 ఉన్నపుడు..రూపాయి ఐ‌సి‌యూ ఉందని ఎద్దేవా చేశారని, ఇప్పుడు అదే మోదీ పాలనలో 83 దాటిందని..అంటే ఇప్పుడు ఏకంగా మార్చురీలో ఉందా అని కామెంట్ చేసారు.

అయితే రేవంత్ మాట్లాడేప్పుడే పలుమార్లు స్పీకర్ అడ్డుకున్నారు. అయినా తన ప్రశ్నని పూర్తి చేశారు. ఈ ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇస్తూ.. తెలంగాణ నుంచి వచ్చిన ఎంపీ రేవంత్‌రెడ్డి పేలవమైన హిందీలో మాట్లాడారని, అందుకు తాను కూడా పేలవమైన హిందీలోనే జవాబు ఇస్తున్నానని వ్యంగ్యంగా మాట్లాడారు. ఇక సమాధానంగా అన్నీ దేశాలతో పోలిస్తే మన దేశం ఆర్ధిక వ్యవస్థ బాగుందని, డాలర్ బలపడుతుందని, దానికి ధీటుగా రూపాయి నిలబడుతుందని యథావిధిగానే గొప్పలు చెప్పుకున్నారు.

ఇక తన హిందీ బాషపై కామెంట్ చేయడంపై రేవంత్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి తన భాష బాగాలేదని కామెంట్‌ చేశారని, తాను శూద్రుడిని కాబట్టి తనకు స్వచ్ఛమైన హిందీ రాదని,  ఆమె బ్రాహ్మణవాది కాబట్టి స్వచ్ఛమైన హిందీ వస్తుందేమో… అదేమీ తనకు సమస్య కాదని రేవంత్‌ బదులిచ్చారు. దీంతో తనది కూడా పేలవమైన హిందీయేనని నిర్మల అన్నారు. కానీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తే సరిపోయేది. కానీ బాషపై కామెంట్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. పైగా తెలుగింటి కోడలు అయి ఉండి..ఒక తెలుగు ఎంపీని అవమానించడం సరికాదని చెప్పవచ్చు. ఈ అంశాన్ని తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు ఖండించాల్సిన అవసరం కూడా ఉంది.  కానీ ఎవరివారికి రాజకీయ ప్రయోజనాలు ఉండటం వల్ల ఈ అంశం గురించే మాట్లాడటం లేదు. ఆఖరికి తెలంగాణలోని సొంత కాంగ్రెస్ నేతలు కూడా ఖడించలేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news