ఎడిట్ నోట్: ప్రధాని-గవర్నర్‌ వర్సెస్ కేసీఆర్..!

-

ప్రధాని-గవర్నర్ వర్సెస్ కేసీఆర్..ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తున్న సీన్..తమకు ఎక్కడకక్కడ చెక్ పెట్టాలని చూస్తున్న బీజేపీకి..అదే స్థాయిలో చెక్ పెట్టడానికి కేసీఆర్ సర్కార్ కూడా ప్రయత్నిస్తుంది. కేవలం పార్టీల పరంగానే కాదు..ప్రభుత్వాల పరంగా కూడా వార్ నడుస్తోంది. మునుగోడు ఉపఎన్నిక ముగిసిన వెంటనే..ఈ వార్ మరింత ముదిరింది. ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీని ఇరికించడమే లక్ష్యంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.

ఇక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌ని సైతం టి‌ఆర్‌ఎస్ గవర్నమెంట్ టార్గెట్ చేసింది. గవర్నర్ తమిళ సై బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని మొదట నుంచి విమర్శలు చేస్తూనే వస్తున్నారు. అటు గవర్నర్ సైతం..కేసీఆర్ సర్కార్‌కు ధీటుగా వెళుతున్నారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దీనికి అసెంబ్లీ, మండలిలో ఆమోదముద్ర వేసుకుని గవర్నర్‌కు పంపారు.

కానీ గవర్నర్..ఈ బిల్లుకు ఆమోదముద్ర వేయలేదు. ఈ బిల్లు వల్ల న్యాయ సమస్యలు వస్తాయనే కోణంలో ఆగారు. దీన్ని అడ్డుగా పెట్టుకుని గవర్నర్‌పై పోరుకు టి‌ఆర్‌ఎస్ సిద్ధమవుతుంది. దీంతో అలెర్ట్ అయిన గవర్నర్..బిల్లుపై చర్చేందుకు ప్రభుత్వం రావాలని లేఖ రాశారు. కానీ విద్యా శాఖ నుంచి ఎవరు వెళ్లలేదు. తమకు ఎలాంటి లేఖ అందలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అయితే లేఖ డైరక్ట్ గా ప్రభుత్వానికే రాశారని తెలిసింది. ఇక చర్చకు ఎవరిని పంపించాలనేది ప్రభుత్వం డిసైడ్ అవ్వాలి. ఇలా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అన్నట్లు వార్ నడుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ నెల 12న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు..రామగుండంకు వచ్చి ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. ఇక ప్రధాని మోదీ పర్యటనపై కూడా టి‌ఆర్‌ఎస్ సర్కార్ ఫైర్ అవుతుంది. ఎప్పుడో ప్రారంభమైన ఎరువుల ఫ్యాక్టరీని ఇప్పుడు జాతికి అంకితం చేయడం ఏంటని టి‌ఆర్‌ఎస్ ఫైర్ అవుతుంది. రామగుండం ఎరువుల కర్మాగారంలో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రధాని మోదీ రాకను వ్యతిరేకిస్తూ ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఎలా చూసుకున్న బీజేపీ టార్గెట్ గానే కే‌సి‌ఆర్ రాజకీయం నడుస్తోంది. మరి కే‌సి‌ఆర్ రాజకీయాన్ని బి‌జే‌పి ఎలా తిప్పికొడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news