జస్ట్ ఇమాజిన్ : ఎన్.టి.ఆర్ బయోపిక్ జూనియర్ చేసుంటే..!

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా వచ్చిన రెండు పార్టులు నిరాశపరచాయి. తండ్రి పాత్రలో బాలకృష్ణ అదరగొట్టినా సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సినిమా చూసిన ఆడియెన్స్ పెదవి విరిచారు. క్రిష్ డైరక్షన్ బాగుంది అనిపించినా ఆడియెన్స్ ఎందుకో సినిమాను ఓన్ చేసుకోలేకపోయారు. ఇక సినిమాలు వాస్తవ అవాస్తవాల గురించి అందరు డిస్కషన్స్ పెట్టేస్తున్నారు.

కథానాయకుడు సినిమా పాజిటివ్ టాక్ వచ్చినా పెద్దగా ప్రభావం చూపించలేదు. అదే లాస్ ప్రాజెక్ట్ కాగా మహానాయకుడు మరీ దారుణంగా మారింది. కనీసం కథానాయకుడు ఓపెనింగ్స్ అయినా రాబట్టగా మహానాయకుడికి అది కరువైంది. ఫలితంగా ఎన్.టి.ఆర్ బయోపిక్ ఓ జ్ఞాపకంగా ఉండాల్సింది పోయి చేదు జ్ఞాపకంగా మారింది.

అయితే నందమూరి ఫ్యాన్స్, కొందరు సిని ప్రేమికులు ఎన్.టి.ఆర్ పాత్రలో బాలకృష్ణ కాకుండా జూనియర్ ఎన్.టి.ఆర్ చేసి ఉంటే ఎలా ఉండేదని ఆలోచిస్తున్నారు. ఎన్.టి.ఆర్ మంచి నటుడే కాని సీనియర్ ఎన్.టి.ఆర్ స్థాయిలో నటించ గలడా అంటే బాలకృష్ణ చేశాడుగా అంటే.. ప్రస్తుతం బాలకృష్ణ వయసు పార్టీ పెట్టినప్పుడు సీనియర్ ఎన్.టి.ఆర్ వయసుకి దగ్గరగా ఉంది కాబట్టి పెద్దగా తేడా కనిపించలేదు కాని జూనియర్ ఎన్.టి.ఆర్ ఆ పాత్ర చేస్తే పెద్దగా మెప్పించకపోవచ్చని కొందరి ఆలోచన. అయినా సినిమా వచ్చింది పోయింది ఇక ఎందుకు ఈ డిస్కషన్ అని కొందరు కొట్టి పడేస్తున్నారు. ఏది ఏమైనా జూనియర్ ఎన్.టి.ఆర్ లో సీనియర్ ఎన్.టి.ఆర్ ను చూసుకునే అభిమానులు ఆయన బయోపిజ్ చేస్తే ఎలా ఉంటుందో అని ఎక్సైట్ అవుతున్నారు. ఎలాగు బాలయ్య చేసి చేతులు కాల్చుకున్నాడు కాబట్టి జూనియర్ ఇక ఆ ఆలోచన చేయకుండా ఉంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news