రాష్ట్ర విభజన జరిగి తెలంగాణా రాష్ట్రం కొత్తగా ఆవిర్భవించి తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే చాలా మంది మాట్లాడిన మాట… అతనికి పరిపాలన వచ్చా…? ఉద్యమ నాయకుడు అతను. ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మాట్లాడిన మాట ఇది. తెలంగాణా రాష్ట్రం అతని చేతుల్లో ఏ మాత్రం క్షేమం కాదని మాట్లాడారు. ఆయన అంటే గిట్టని వాళ్ళు కూడా ఇదే విధంగా మాట్లాడారు.
ముఖ్యమంత్రి అయిన వెంటనే హైదరాబాద్ కి సంబంధించి ఏర్పాటు చేసిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో కెసిఆర్ హైదరాబాద్ రూపు రేకలు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరిస్తే అందరూ షాక్ అయ్యారు. వారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయాల్లో పని చేసిన అధికారులు కూడా ఉన్నారు. వారికి కెసిఆర్ హైదరాబాద్ గురించి వివరిస్తే మీడియా కూడా షాక్ అయింది.
మెట్రో గురించి ఆయన చెప్పిన విధానం, ఏ కాగితం లేకుండా నోటి మాటతో కెసిఆర్ చెప్పిన విధానం చూసి షాక్ అయ్యారు. తెలంగాణా వాళ్లకు పరిపాలన రాదు కాబట్టే అని మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా అయిదేళ్ళ కెసిఆర్ పాలన చూసి షాక్ అయ్యారు. 2018 ఎన్నికల్లో తెరాస పార్టీకి ఊహించని విధంగా మెజారిటి వస్తే చాలా మందికి నోట మాట రాలేదు. కెసిఆర్ సామర్ధ్యం తక్కువ అంచనా వేసిన వాళ్ళు అందరూ కూడా షాక్ అయ్యారు.
ఇప్పుడు కరోన తెలంగాణాలో విస్తరిస్తుంది. ఆ కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ సతమతవుతుంది. దేశం మొత్తం కూడా ఎం చెయ్యాలో అర్ధం కాని స్థితిలో ఉంది. తెలంగాణా సరిహద్దులను పంచుకున్న కర్ణాటక, మహారాష్ట్రలో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. మహారాష్ట్ర నుంచి ఎన్నో ఆహార ఉత్పత్తులు రాష్ట్రానికి వస్తాయి. అయినా సరే తెలంగాణా ముఖ్యమంత్రిగా తన బిడ్డల భద్రత ఆలోచించి కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
సరిహద్దులను మూసి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించకు ముందే ఆయన తెలంగాణకు ప్రకటించి సంచలనం సృష్టించారు. కరోనా గురించి ప్రతీ క్షణం ప్రతీ నిమిషం ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతీ క్షణం కూడా కెసిఆర్ అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఎక్కడా కూడా ఆయన అలసత్వం ప్రదర్శించడం లేదు. నిధులు అయినా విధులు అయినా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు.
తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో కెసిఆర్ ఒక కీలక ప్రకటన చేసారు. తెలంగాణా లో పండే ప్రతీ పంటా కూడా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయవద్దని స్పష్టం చేసారు. అవి పంటలు అయినా నిత్యావసర సరుకులు అయినా సరే రాష్ట్రంలో ఉన్న వాళ్లకు సరిపోతాయి ప్రభుత్వమే వాటిని కొంటుంది అని ప్రకటించారు. ముఖ్యమంత్రులకు ఆయన నిర్ణయాలు అన్నీ ఆదర్శంగా నిలుస్తున్నాయి.
తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న చర్యలు చూసే ఇతర రాష్ట్రాలు కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నాయి. తెలంగాణా జనతా కర్ఫ్యూ ని 24 గంటలు అన్న తర్వాతే ఇతర రాష్ట్రాలు పొడిగించాయి. ప్రజలు ఎక్కడ భయపడతారో అని భావించిన కెసిఆర్ వారికి చాలా జాగ్రత్తగా సూచనలు చేస్తున్నారు. ఇంట్లో మనిషి మాట్లాడిన విధంగా మాట్లాడి ధైర్యం చెప్తున్నారు. ప్రతీ క్షణం కూడా అప్రమత్తంగా ఉంటున్నారు.
విదేశాల నుంచి వచ్చిన వారికీ దండం పెట్టినా… మాట వినకపోతే కాల్చి చంపుతామని హెచ్చరించినా, మీడియాను ఎవరూ ఏమీ అనవద్దని చెప్పినా ఆయనకే చెల్లింది. ఉద్యమ నాయకుడు ఇప్పుడు తెలంగాణకు అండగా నిలబడ్డాడు. సొంత రాష్ట్రం సాధించడంలో ఏ విధంగా అయితే కెసిఆర్ కష్టపడి చావు అంచుల వరకు వెళ్లి వచ్చారో… నేడు తాను కన్న తల్లి కోసం కొడుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు.
నా బిడ్డలను కాపాడుకుంటా అని ఇంటి మనిషిగా ధైర్యం చెప్తున్నాడు ఆయన. 60 వేల మందికి కరోనా వచ్చినా సరే నేను ఉన్నా కాపాడుకుంటా అని స్పష్టంగా చెప్తున్నారు. ప్రజలు ఎవరూ భయపడవద్దు అని, మీకు కెసిఆర్ ఉన్నాడని ఆయన చెప్తున్న ధైర్యం చూసి పక్క రాష్ట్రాలు సిగ్గు పడుతున్నాయి. ప్రజలకు ఇబ్బంది లేకుండా రేషన్ ఇవ్వడమే కాదు, ప్రజలు రోడ్ల మీదకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. సాహో కెసిఆర్ అనిపించుకున్నారు.