మహర్షి సినిమాలో హీరో మహేష్ బాబుతోపాటు మరో హీరో అల్లరి నరేష్ కూడా నటించాడు. అయితే అల్లరి నరేష్ పాత్రను సినిమాలో సైడ్ క్యారెక్టర్‌లా మార్చేశారు.
ఒకప్పుడు మన తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ చిత్రాలు పెద్దగా వచ్చేవి కావు. ఎప్పుడో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణల కాలంలో మల్టీస్టారర్లు బాగా వచ్చేవి. కానీ ఆ తరువాత ఆ తరహా చిత్రాలు పెద్దగా రాలేదు. కానీ బాలీవుడ్ మహత్మ్యమో లేదా మరే ఇతర కారణమో తెలియదు కానీ.. ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లోనూ మల్టీస్టారర్లు పెరిగాయి. ఈ క్రమంలో ఈ సినిమాలను ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. అయితే మల్టీస్టారర్ అనగానే అందులో నటించే హీరోలు ఎవరైనా సరే.. వారికి సినిమా ప్రమోషన్లలో, ఇతర అంశాల్లో సమానంగా ప్రాధాన్యతను ఇస్తారు. ఆది నుంచి మల్టీస్టారర్ చిత్రంలో నటించిన అందరు హీరోలు, హీరోయిన్లతో సమానంగా ప్రమోషన్లు చేస్తారు. కానీ.. ఇటీవల వచ్చిన మహర్షి సినిమా చిత్ర యూనిట్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించిందనే చెప్పవచ్చు.
మహర్షి సినిమాలో హీరో మహేష్ బాబుతోపాటు మరో హీరో అల్లరి నరేష్ కూడా నటించాడు. అయితే అల్లరి నరేష్ పాత్రను సినిమాలో సైడ్ క్యారెక్టర్‌లా మార్చేశారు. నిజానికి నరేష్ కూడా హీరోయే. అతను 50 చిత్రాల్లో నటించాడు. ఈ క్రమంలోనే మహర్షి సినిమాలోనూ నటించాడు. అయితే సోలోగా అన్ని చిత్రాల్లో నటించి ఒక చిత్రంలో మరో హీరోతో కలసి నటిస్తే.. అప్పుడు ఆ సినిమాను మల్టీ స్టారర్ అనే అనాలి. కానీ నరేష్‌ను చిత్ర యూనిట్ పెద్దగా ఎక్స్‌పోజ్ చేయలేదు. కేవలం మహేష్‌నే హీరోగా చూపించారు. కానీ నిజానికి నరేష్‌ది కూడా మహర్షి సినిమాలో హీరో పాత్రే. అయితే నరేష్ పాత్రను చిత్ర యూనిట్ సైడ్ క్యారెక్టర్‌గా మార్చేసింది.
నిజానికి మహర్షి సినిమాలో నరేష్‌ది చాలా స్కోప్ ఉన్న పాత్ర. చాలా కీలకమైన పాత్ర. స్టోరీ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. ఆ క్యారెక్టర్ కోసమే కదా.. రిషి అనే క్యారెక్టర్ అంత పెద్ద హోదాలో ఉండి కూడా వెతుక్కుంటూ వస్తాడు. అయితే చివరికి నరేష్ ఇమేజ్ పెరుగుతుందనో.. ఏమో.. తెలియదు కానీ.. చివరకు నరేష్‌ను హాస్పిటల్‌కే పరిమితం చేశారు. గ్రామంలో గ్రామ సమితి పేరిట మొదట్నుంచీ పోరాటం చేసింది నరేషే. కానీ అతను హాస్పిటల్ పాలు కావడంతో మహేష్ ఆ పోరాటాన్ని కొనసాగిస్తాడు. అయితే చివరకు విజయం సాధించినా.. అది నరేష్ కే దక్కుతుంది. కానీ మహేష్‌నే హీరోను చేసి నరేష్‌ను జీరోను చేశారు.
ఇక మహర్షి సినిమాలో ప్రమోషన్ల నుంచి సినిమా విడుదల అయ్యాక ఇంటర్వ్యూల వరకు కేవలం మహేష్‌నే చాలా సందర్భాల్లో తెరపైకి తెచ్చారు. కానీ నరేష్ గురించి పట్టించుకోలేదు. నిజానికి ఈ సినిమా మల్టీస్టారర్ సినిమా. కానీ హీరో మహేష్ కోసం నరేష్ పాత్రను సాధారణ పాత్రగా మార్చారు. దానికి అంతగా ప్రాధాన్యత లేనట్లు చూపించారు. ఈ క్రమంలోనే ఓ సగటు మల్టీస్టారర్ సినిమా తరహాలో మహర్షి సినిమాను ఎందుకు ప్రమోట్ చేయలేదని ఇప్పుడు అభిమానులు ప్రశ్నిస్తున్నారు.. మరి చిత్ర యూనిట్ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి..!