కోహ్లీలో అభిమానులకు నచ్చే లక్షణాలు ఇవే…!

-

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి’ అంతర్జాతీయ క్రికెట్ లో ఇతను ఒక సంచలనం. తన ఈ పదేళ్ళ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో నమోదు చేసుకున్నాడు. ఇప్పటి వరకు దిగ్గజ ఆటగాళ్లకు కూడా సాధ్యం కాని ఎన్నో రికార్డులను తన ఖాతాలో నమోదు చేసుకున్నాడు కోహ్లి. ఇక ఆ జట్టు ఈ జట్టు అనే తేడా లేకుండా కోహ్లీ ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

క్రికెట్ దిగ్గజాలు సచిన్, పాంటింగ్ అందుకోలేని ఎన్నో రికార్డులు కోహ్లి బ్యాట్ నమోదు చేసింది. కెప్టెన్ గా కూడా అతను ఎన్నో రికార్డులు నమోదు చేసాడు. అది పక్కన పెడితే ఒక ఆటగాడిగా కోహ్లి ఆట తీరుని ఒకసారి చూద్దాం, మైదానంలో అతను ఏ విధంగా ప్రవర్తిస్తాడు, అసలు టీం సభ్యులతో అతను ఏ విధంగా ప్రవర్తిస్తాడు, మైదానంలో అతని దూకుడు ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం.

సాధారణంగా కోహ్లీని చూసిన వారికి గంగూలీ గుర్తుకి వస్తాడు. సరిగా 15 ఏళ్ళ క్రితం గంగూలీని చూసినట్టే ఉంటుంది అంటారు కోహ్లీని చూస్తే. అవును మైదానంలో అతని దూకుడు స్వభావం చూసిన ప్రతీ ఒక్కరు మాట్లాడే మాట ఇదే. కోహ్లిది సాఫ్ట్ క్యారెక్టర్ కాదు. అలా అని అనవసరంగా దూకుడుగా ఉండే నాయకుడు అంత కన్నా కాదు. 2017 లో జరిగిన ఆస్ట్రేలియా ఇండియా సీరీస్ లో అప్పటి ఆసిస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ విషయంలో,

కోహ్లీ ప్రదర్శించిన వైఖరిని చాలా క్రికెట్ దేశాలు వెనకేసుకు వచ్చాయి. ఆస్ట్రేలియాకు దీటుగా అతను సమాధానం చెప్పడమే కాకుండా ఇక ఆస్ట్రేలియా ఆటగాళ్లను స్నేహితులుగా చూడలేమని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. వాస్తవానికి వాళ్ళు కోహ్లిని చాలా వరకు ఇబ్బంది పెట్టారు. మాటలతో చేష్టలతో ఆసిస్ ఆటగాళ్ళ ప్రవర్తన కోహ్లికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది అనేది వాస్తవం.

2012 తర్వాత జరిగిన ఒక ఆస్ట్రేలియా పర్యటనలో ఆసిస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ కోహ్లీని ఉద్దేశింఛి కాస్త దూకుడుగా ప్రవర్తించాడు. దీనికి కోహ్లీ కూడా అదే స్థాయిలో స్పందించి భారీ సెంచరి సాధించి సమాధానం చెప్పాడు. ఇక కెప్టెన్ గా అతని విషయానికి వస్తే, కోహ్లీ దూకుడు నాయకుడిగా ప్రతీ ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. మైదానంలో టీం ని అతను నడిపి౦చే విధానానికి ప్రత్యర్ధి జట్లు కూడా ఫిదా అయిపోయాయి.

కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన కొత్తలో మైదానం వద్ద ఫీల్డింగ్ చేస్తూ ధోనికి బాధ్యతలు ఇచ్చే వాడు. బౌలింగ్ మార్చడం, ఫీల్డింగ్ ఎంపికలో ప్రతీ ఒక్కటి కూడా ధోని అనుభవాన్ని కోహ్లీ వాడుకున్న విధానం అందరిని ఆకట్టుకుంది. ఇక జట్టులో ఎవరైనా ఆటగాడు సెంచరి చేసినా, దూకుడుగా ఆడుతున్న సరే కోహ్లి డ్రెస్సింగ్ రూమ్ లో చిన్న పిల్లాడిలా గంతులు వేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు.

రోహిత్ శర్మతో అతనికి విభేదాలు ఉన్నాయని మీడియా అంటది. కాని కోహ్లీ మాత్రం రోహిత్ సెంచరి చేస్తే గంతులు వేస్తాడు. డ్రెస్సింగ్ రూమ్ లో అతను చేసుకునే సంబరాలు కల్మషం లేకుండా ఉంటాయి. అతని మనసులో ఎం ఉంది అనేది పక్కన పెడితే ఆ సంబరాల్లో ఏ స్వార్ధం ఉండదు. ఇక యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో కోహ్లీ గంగూలీని గుర్తు చేసాడు అనేది అందరూ అనే మాట.

రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, బూమ్రా, చాహల్ ఇలా అందరిని అతను ముందుకి నడిపిస్తున్నాడు. ముఖ్యంగా అవకాశాలు ఇవ్వడం వాళ్ళను ఆడినా ఆడకపోయినా ప్రోత్సహించడం చేస్తున్నాడు. సీనియర్లు గా ఉన్న శమీ, పుజారా, జడేజా, రోహిత్, ధావన్ లను అతను వాడుకునే విధానం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంబటి రాయుడు కొన్నాళ్ళు సరిగా ఉండి ఉంటే మరో నాలుగేళ్ల పాటు నాలుగో స్థానం అతనిదే.

ఆ విధంగా కోహ్లీ ప్రోత్సహిస్తూ వచ్చాడు. జట్టు అవసరాలకు తగిన విధంగా ఆడటమే కాదు నాయకుడు ఆడితే టీం బాగుంటుంది అని కెప్టెన్ గా తన మీద ఉన్న ఒత్తిడి తానే భరిస్తాడు గాని ఆటలో దాన్ని చూపించే ప్రయత్నం ఎక్కడా చేసే ప్రయత్నం ఏ మాత్రం చేయడు. కెఎల్ రాహుల్ కోసం నేను నాలుగో స్థానంలో ఆడటానికి అయినా సిద్దమే అంటూ అతను చేసిన ప్రకటన అతని హుందా తనాన్ని బయటపెట్టింది. ఆ విధంగా కోహ్లీ ప్రతీ విషయంలోనూ ఆకట్టుకు౦టూనే ఉంటాడు.

Read more RELATED
Recommended to you

Latest news