ఒకవేళ లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు మొత్తం 100కు పైగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటే.. అప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఓ ఆప్షన్‌ను పెట్టుకున్నారని తెలిసింది.
లోక్‌సభ ఎన్నికల అంకం తుది దశకు చేరుకుంటోంది. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లో మరో మూడు దశలలో పోలింగ్ ముగియనుంది. దీంతో ఎన్నికల తరువాత వచ్చే ఫలితాలను బట్టి ఏం చేద్దామని ఇప్పటికే అటు జాతీయ పార్టీలతోపాటు రాష్ట్రాలకు చెందిన పలు ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని గతంలో అనేక సార్లు చెప్పిన సీఎం కేసీఆర్ ఎన్నికల ఫలితాల తరువాత ఏం చేద్దామని సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఆయన ఇప్పటికే ఎన్నికల ఫలితాల అనంతరం ఏం చేయాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా ముందుకు సాగాలి.. అనే అంశాలపై రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలిసింది.
కేంద్రంలో కాంగ్రెస్ లేదా బీజేపీలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే సూచనలు కనిపించడం లేదని గత కొంత కాలంగా సర్వేలు చెబుతున్న విషయం విదితమే. అయితే అదే నిజమైన సందర్భంలో ఎలా ముందుకు సాగాలనేదానిపై సీఎం కేసీఆర్ గత కొద్ది రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, కేంద్రంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది.. తదితర విషయాలపై సీఎం కేసీఆర్ తమ పార్టీ నాయకులతో చాలా రోజులుగా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మే 23వ తేదీన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విధంగా ఉండబోతున్నాయి, టీఆర్ఎస్ పార్టీ ఎలా వ్యవహరించాలి, ఎలా ముందుకు సాగాలి.. అనే అంశాలతోపాటు, అనుకున్నది నెరవేరకపోతే ప్రత్యామ్నాయాలు ఏమిటి ? అనే దిశగా కూడా కేసీఆర్ వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు మొత్తం 100కు పైగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటే.. అప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఓ ఆప్షన్‌ను పెట్టుకున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఏయే రాష్ట్రాల్లో ఏయే పార్టీలకు ఎన్ని ఎంపీ స్థానాలు వస్తాయనే విషయంపై కూడా సీఎం కేసీఆర్ అంతర్గతంగా సర్వే చేయించినట్లు తెలిసింది. దీంతో ఫలితాలు రాగానే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారని సమాచారం అందుతోంది.
అయితే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాకపోతే.. ఒక వేళ బీజేపీ లేదా కాంగ్రెస్‌లలో ఏదో ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అప్పుడు ఎలా ముందుకు సాగాలి.. అనే విషయం కూడా కేసీఆర్ రెండు, మూడు ఆప్షన్‌లను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఆ సమయంలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా ఆ ఆప్షన్లలో ఏదో ఒక దాన్ని కేసీఆర్ బయటకు తీసుకువస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఫలితాల రోజు కేసీఆర్ ఢిల్లీ వెళ్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఫలితాల అనంతరం ఆయన అక్కడే నాలుగైదు రోజులు లేదా వారం పాటు ఉంటారని, తెరాస సీనియర్ నేతలతో కలసి ఢిల్లీలో మంతనాలు జరుపుతారని తెలుస్తోంది. ఇక ఫలితాల అనంతరం పార్టీ పరంగా ఎలా వ్యవహరించాలి, ఎలా ముందుకు సాగాలి ? అనే విషయాలపై కూడా కేసీఆర్ ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారని, అందుకుగాను ఓ బ్లూ ప్రింట్‌ను ఆయన సిద్ధం చేశారని సమాచారం. అయితే మరి.. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పుతారా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది..!