మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. రక్షణ శాఖ పరిధిలోని ఏఎస్‌సీ ANC సెంటర్ సౌత్ (బెంగళూరు)-2 ఏటీసీ ఖాళీగా ఉన్న 100 గ్రూప్-సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..
సివిల్ మోటార్ డ్రైవర్, క్లీనర్, కుక్ వంటి పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారు బెంగళూరులో పని చేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలని https://www.indianarmy.nic.in/ వెబ్‌సైట్ లో చూడొచ్చు. జులై 12 దరఖాస్తులకు చివరితేది.
ఇక పోస్టుల వివరాలలోకి వెళితే.. మొత్తం పోస్టులు 100 వున్నాయి. సివిల్ మోటార్ డ్రైవర్- 42,
క్లీనర్- 40, కుక్- 15, సివిలియన్ క్యాటరింగ్ ఇన్‌స్ట్రక్టర్- 3. అర్హత విషయంలోకి వస్తే.. పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.
అదే డ్రైవర్ పోస్టుకు అయితే ఎల్ఎంవీ, హెచ్ఎంవీ లైసెన్స్, క్యాటరింగ్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు క్యాటరింగ్‌లో డిప్లొమా ఉండాలి. మిగిలిన పోస్టులకు సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల కోసం ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను పూర్తిగా నింపి అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులను పంపాల్సిన చిరునామా: The Presiding Officer, Civilian Direct Recruitment Board, CHQ, ASC Centre (South)- 2 ATC, Agram Post, Bangalore-560007
వెబ్‌సైట్: https://www.indianarmy.nic.in/