కాసేపట్లో కీలక నిర్ణయం.. కేంద్రమంత్రులు, బీజేపీ చీఫ్‌తో మోదీ భేటీ

-

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ విస్తరణ కసరత్తు చివరి దశకు చేరుకోనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పట్లు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది.  ఇవాళ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కాసేపట్లో కేంద్రమంత్రులు, బీజేపీ అధ్యక్షుడితో ప్రధాని భేటీ కానున్నారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌‌తో పాటు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా సహా మరికొందరు మంత్రులు కూడా పాల్గొననున్నారు.

ప్రధాని మోదీ నివాసంలో ఈ సమావేశం జరుగనుంది. పలు కీలక విషయాలపై చర్చించనున్నారు. కేంద్ర కేబినెట్‌‌ను విస్తరించాలని ఇప్పటికే ప్రధాని మోదీ భావిస్తున్నారు. ఈ మేరకు మొత్తం 18 మందిని తన కేబినెట్‌లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఖాళీగా ఉన్న మంత్రిత్వ శాఖలతో పాటు పని చేయని మంత్రులపై వేటు వేస్తారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాదిలో ఐదు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ ఛాన్స్ దక్కలేదని ఇప్పటికే ఢిల్లీ నుంచి సమాచారం అందినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news