CBSE : బోర్డు పరీక్షలు రద్దు అవుతున్నాయా..? విద్యార్థులు రద్దు చెయ్యాలని డిమాండ్…!

-

కరోనా మహమ్మారి కారణంగా పరీక్షలు అనేక మార్లు వాయిదా పడ్డాయి. నిజానికి కరోనా మహమ్మారి విద్యారంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ మహమ్మారి వలన విద్యా సంస్థలు కూడా మూతపడ్డాయి. పరీక్షలను కూడా పూర్తిగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడిప్పుడే కరోనా వలన సమస్యలు తగ్గుతున్నాయి అని అనుకుంటుంటే మళ్ళీ కరోనా కేసులు వస్తున్నాయి.

 

మరో సారి కరోనా కేసులు పెరుగుతుండటం దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. అయితే దీని మూలంగా
విద్యార్థుల పరీక్షల పై పడే అవకాశం ఉంది. అయితే కరోనా వలన సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు పోస్ట్ పోన్ అయ్యేలా కనపడుతోంది. మరి ఇక దీని కోసం పూర్తి వివరాలు లోకి వెళితే.. ఏప్రిల్ 26 నుంచి సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ బోర్డుల పరీక్షలు మొదలు అవ్వనున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగితే ఈ పరీక్షలను రద్దు చేస్తారా లేదా అనేది విద్యార్థులలో ఆందోళన కలిగిస్తోంది.

మరి కరోనా కేసులు విపరీతంగా పెరిగితే ఈ పరీక్షలను క్యాన్సల్ చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే కొంత మంది విద్యార్థులు బోర్డు పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చెయ్యాలని అంటున్నారు.

ఈ ఏడాది రెండు టర్మ్‌ల్లో పరీక్షలను నిర్వహిస్తామని సీబీఈఎస్‌ఈ ప్రకటించినప్పుడు తన అధికారిక నోటీస్‌లో ఇలా కూడా ఇదే విషయాన్ని చెప్పింది. టర్మ్ 1 పరీక్షలు, ఇంటర్నల్ అసెస్‌మెంట్ ఆధారంగా తుది ఫలితాలను విడుదల చేస్తామని బోర్డు నోటీస్‌లో చెప్పింది. త్వరలో ఈ అంశంపై అధికారికంగా స్పష్టత వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news