పరీక్షలు దగ్గర పడుతున్నాయని భయం వస్తోందా..? అయితే ఇలా పోగొట్టుకోచ్చు..!

-

పరీక్షలు దగ్గర పడుతున్నాయి అంటే పిల్లల్లో భయం మొదలవుతుంది. ఎలా చదవాలి..? పరీక్షలు ఎలా రాయాలి అని వాళ్లు తెగ ఆందోళన చెందుతారు. నిజానికి వాళ్ళలో ఇలాంటి భయం కలుగుతుంటే తల్లిదండ్రులు కూడా కంగారు పడుతున్నారు.

పిల్లల పై టీచర్లు, స్కూల్స్ అధిక ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే పిల్లల్లో భయాన్ని పోగొట్టాలంటే ఈ విధంగా అనుసరిస్తే మంచిది. దీంతో భయం పోయి పిల్లలు బాగా పరీక్షలు రాయగలుగుతారు. మరి వాటి కోసమే ఇప్పుడు చూద్దాం.

ప్లాన్ చేసుకోవాలి:

పిల్లలు ఎప్పుడు ఏం చదువుతున్నారు అనేది రాసుకోవాలి. టైం టేబుల్ తయారు చేసుకుని దానికి తగ్గట్టుగా అనుసరిస్తే సిలబస్ పూర్తిచేయగలుగుతారు. దీంతో పరీక్షలు బాగా రాయడానికి అవుతుంది. అలానే భయం కూడా ఉండదు.

అనుకూలమైన ప్రదేశం కల్పించడం:

పిల్లలు చదువుకునేటప్పుడు ప్రశాంతంగా ఉండే ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలి. టీవీ గదిలో కూర్చుని చదవడం లేదంటే నలుగురు వచ్చి పోయే చోట కూర్చోవడం వలన వాళ్ళు చదవలేరు. అలానే ఎక్కువ శబ్దాలు వచ్చే చోట కూడా పిల్లలు చదువు లేరు. కాబట్టి వాళ్ళకి అనుకూలమైన ప్రదేశాన్ని కల్పించడం చాలా ముఖ్యం.

టైం లిమిట్:

ఎక్కువసేపు చదవకుండా 40 నుండి 45 నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ చదవడం వల్ల బాగా చదవడానికి అవుతుంది. అలానే భయం కూడా ఉండదు.

రిలాక్స్ గా ఉంచండి:

పిల్లలు రిలాక్స్ గా ఉండేటట్లు చేయాలి. మనసులో ఎటువంటి భయాలను పెట్టుకోకుండా హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటట్టు చూడాలి. వ్యాయామం వలన కూడా రిలాక్స్ గా ఉండగలరు.

ఆహారం:

పిల్లల ఆహారం పట్ల కూడా శ్రద్ధ చూపించాలి తగినంత మంచినీళ్లు తీసుకునేలా చూడాలి. నిద్ర, ఒత్తిడి వంటి విషయాల్లో కూడా శ్రద్ధ చూపించాలి. నెగిటివ్ థింకింగ్ లేకుండా తల్లిదండ్రులు చేయాలి. ఒకవేళ కనుక మీ పిల్లలు బాగా భయపడుతుంటే మానసిక వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news