తెలంగాణలో భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. ఎండలు మండతున్నాయి. జనాలు బయటకు అడుగు వేయాలంటేనే భయపడుతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండల తీవ్రత పెరగుతోంది. అత్యవసరం అయితే తప్పితే జనాలు బయట అడుగుపెట్టడం లేదు. ఏదైనా అవసరం నిమిత్తం బయటకు వెళ్లాలంటే ఖచ్చితంగా ఒకటి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. మరోవైపు వడగాలుల వల్ల జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటుతున్నాయి.
ఈరోజు ( బుధవారం) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో అత్యధికంగా 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లా మేడారం, నిర్మల్ జిల్లా ఖానాపూర్, నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లిలో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా బోరాజ్లో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కుమ్రం భీ జిల్లా కెరిమెరి, నిజామా బాద్ జిల్లా పాల్దా, ఆదిలా బాద్ జిల్లా జైనథ్ లో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది.