ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా..? మరి ఈ 5 నోటిఫికేషన్స్ కి అప్లై చేసేయండి.. పూర్తి వివరాలు ఇవే..!

-

ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా..? అయితే మీరు తప్పక ఈ నోటిఫికేషన్స్ ని చూడాలి. మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నట్టయితే ఈ వివరాలని చూడాలి. పూర్తి వివరాలు వున్నాయి. మరి ఓ లుక్ వేసేయండి.

ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్:

ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమైతే ఈ వివరాల్ని చూడాల్సిందే. ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్), మరియు యాంట్రిక్ పోస్టులున్నాయి. పురుషులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ joinindiancoastguard.cdac.in లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 22, 2022.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో పలు ఖాళీలు వున్నాయి. ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమైతే ఈ వివరాల్ని చూడాల్సిందే. క్లరికల్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 27, 2022. sbi/careers , sbi.co.in ద్వారా పూర్తి వివరాలను పొందొచ్చు.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా:

నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమైతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేందుకు చివరి తేదీ అక్టోబర్ 05, 2022. fci.gov.in ని ఓపెన్ చేసి పూర్తి వివరాలను పొందొచ్చు. మొత్తం 5043 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్:

తెలంగాణ రాష్ట్రం లోని మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1 పోస్టుల కోసం మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in ద్వారా పూర్తి వివరాలను పొందొచ్చు. అప్లై చేసేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 29. మొత్తం 181 ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

SAIL రిక్రూట్మెంట్:

అటెండెంట్-కమ్-టెక్నీషియన్ ట్రైనీ(NAC) పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 15, 2022. మొత్తం 146 ఖాళీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. sail.co.in ద్వారా పూర్తి వివరాలను పొందొచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news