ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలని చూస్తే.. 56 ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అటెండెంట్‌ పోస్టులు వున్నాయి. అర్హులైన వాళ్ళు అప్లై చేసుకోచ్చు.

ఇక పోస్టుల వివరాలలోకి వెళితే.. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, గేడ్‌ 4, ఆపరేషన్స్‌ విభాగాల్లో ఖాళీలు వున్నాయి. అర్హత వివరాలను చూస్తే.. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకి సంబంధిత స్పెషలైజేషన్‌ లో కనీసం 55 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా కోర్సు లో ప్యాస్ అయ్యి ఉండాలి.

టెక్నీకల్ అటెండెండ్ పోస్టులకి అయితే పదవ తరగతి ప్యాస్ అయ్యి ఉండాలి. అలానే సంబంధిత విభాగంలో ఐటీఐలో ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. వయసు విషయానికి వస్తే.. 18 నుంచి 26 ఏళ్ల వయస్సు ఉండాలి. 26 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.

అక్టోబర్‌ 10, 2022వ తేదీలోపు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్‌ ఫీజు కింద రూ.100 చెల్లించాలి. సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ప్రొఫిషియన్సీ/ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. శాలరీ విషయానికి వస్తే.. నెలకు రూ.23,000ల నుంచి రూ.1,05,000ల వరకు ఇస్తారు. పూర్తి వివరాలను https://iocl.com/latest-job-opening లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news