చిరు సినిమా కోసం సల్మాన్ ఖాన్ పారితోషికం అన్ని కోట్లా..?

-

కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాలీవుడ్లో ఒక్క సినిమాలో నటిస్తే రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి ఒక స్టార్ హీరో తెలుగులో నటిస్తున్నారు అంటే ఆ సినిమాకు ఎంత బజ్ ఏర్పడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ క్రమంలోని మెగాస్టార్ సినిమా కోసం ఆయన తెలుగులో నటించడానికి సిద్ధం అయ్యాడు. ఇక ఈ క్రమంలోని మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు చిరంజీవి.. ఇక మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది . త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది . ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

మరి ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాలో మెగాస్టార్ , సల్మాన్ ఖాన్ కలిసి ఒక పాటలు కనిపించనున్నారు. దాంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగిపోయింది అని చెప్పవచ్చు. ఇకపోతే సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న కీలక పాత్ర కోసం ఏకంగా రూ. 40 కోట్ల వరకు అందుకున్నాడు అని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా తెలుగుతోపాటు హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు. కాబట్టి అక్కడ కూడా ఈ సినిమా మంచి మార్కెట్ ను క్రియేట్ చేస్తుందని కూడా మేకర్స్ భావిస్తున్నారు.

మరి ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమాను తెరకెక్కిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఇందులో సత్యదేవ్, నయనతార, సునీల్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. మరి దసరా కానుకగా గాడ్ ఫాదర్ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు సన్నహాలు కూడా సిద్ధం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news