మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రూప్ ‘సీ’ పోస్టులు ఖాళీ వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. హైదరాబాద్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రూప్ ‘సీ’ ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి. ఈ మేరకి నోటిఫికేషన్ ని రిలీజ్ చేసారు. ఆన్ లైన్ విధానంలో ఈ పోస్టుల కి అప్లై చేసుకోవాల్సి వుంది.
పోస్టుల వివరాలు లోకి వెళితే.. అసిస్టెంట్ వార్డెన్ (మహిళ) పోస్టులు: 2, నర్సు (మహిళ) పోస్టులు: 1, అసిస్టెంట్(ఫైనాన్షియల్ అండ్ అకౌంట్స్) పోస్టులు: 2, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: 2, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు: 1, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు: 3 వున్నాయి. ఇక వయస్సు విషయానికి వస్తే.. ఈ పోస్టుల కోసం అప్లై చేయాలని అనుకునే వారికి 27 ఏళ్లకు మించకుండా ఉండాల్సిందే. అప్లికేషన్లను ఏప్రిల్ 30, 2023వ తేదీలోపు పంపించాలి.
ఇక అర్హత వివరాలని చూస్తే.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంటర్మీడియట్/డిప్లొమా/ ఐటీఐ/ బీఎస్సీ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ని పూర్తి చేసి ఉండాలి. అలానే సంబంధిత పనిలో ఆరు నెలల నుంచి ఐదు ఏళ్ల వరకు అనుభవం ఉండాలి. ప్రాక్టికల్ టెస్ట్/ స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. జనరల్/ఓబీసీ అభ్యర్ధులు రూ.500లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.250 అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ప్రాక్టికల్ టెస్ట్/ స్కిల్ టెస్ట్, రాతపరీక్ష లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అధికారిక నోటిఫికేషన్ లో పూర్తి వివరాల ని చెక్ చేసుకోవచ్చు.