మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ ఈరోజు జరగనుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు సిద్ధం అయ్యాయి. మొత్తం 16లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరు అవుతున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఈ పరీక్షలు వాయిదా పడతాయని వార్తలు వచ్చినప్పటికీ, అమలు కాలేదు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు సహా మొత్తం 13భారతీయ భాషల్లో నీట్ పరీక్ష జరగనుంది. మద్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష జరగనుంది.
మొత్తం దేశవ్యాప్తంగా 3842పరీక్షా కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. తెలంగాణలో 112, ఆంధ్రప్రదేశ్ లో 151పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసారు. నీట్ పరీక్షకు హాజరయ్యే వారు అడ్మిట్ కార్డు కార్డుతో పాటు , ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డు వంటి ఏదైనా ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి. పరీక్షలో తప్పులకు పాల్పడితే మూడేళ్ళ పాటు డిబార్ చేస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివరించింది.