టెన్త్ అర్హతతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సులో 787 పోస్టులు…పూర్తి వివరాలివే..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యురిటీ ఫోర్స్‌ లో కొన్ని ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. దీనిలో మొత్తం 787 కానిస్టేబుల్, ట్రేడ్‌మెన్‌ పోస్టులు వున్నాయి. మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు.

jobs
jobs

పోస్టుల వివరాలను చూస్తే.. పురుషులకు 641, మహిళలకు 69, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు 77 పోస్టులున్నాయి. ఇక అర్హత వివరాలను చూస్తే…. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే బార్బర్‌/బూట్‌మేకర్/కాబ్లర్/టైలర్/కుక్/మాసన్‌/మాలి/పెయింటర్‌/ప్లంబర్‌/వాషర్‌ మ్యాన్/వెల్డర్‌ పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే టెన్త్ ప్యాస్ అయ్యి ఉండాలి. ఐటీఐ ట్రైన్డ్‌ అభ్యర్ధులకు ప్రాధాన్యత ఇస్తారు.

ఇక వయస్సు విషయానికి వస్తే.. ఈ పోస్టులకి అప్లై చేసుకునే అభ్యర్ధుల వయసు ఆగస్టు 1, 2022వ నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఫీజు విషయానికి వస్తే.. అభ్యర్ధులు రూ.100లు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద పే చేయాల్సి వుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు ఎలాంటి ఫీజు లేదు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి డిసెంబర్‌ 20, 2022 చివరి తేదీ. ఫిజికల్ ఫిట్ నెస్ కూడా చూస్తారు. ఎస్‌టీ, పీఈటీ, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్టు ప్యాస్ అయినవారికి రెండు గంటల వ్యవధిలో రాత పరీక్ష ఉంటుంది. పూర్తి వివరాలను https://www.cisfrectt.in/ లో చూడచ్చు.