IDBI బ్యాంక్‌లో ఖాళీలు… పూర్తి వివరాలు మీకోసం..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. IDBI బ్యాంక్ లో పలు ఉద్యోగ ఖాళీలు వున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ ని విడుదల చేసారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలని చూస్తే..

హెడ్ డేటా అనలిటిక్స్, హెడ్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ & ఇన్ఫర్మేషన్, డిప్యూటీ ఖాళీలు వున్నాయి. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. 30 సెప్టెంబర్ 2022లోపు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక పోస్టుల వివరాలు చూస్తే.. హెడ్ ​​– డేటా అనలిటిక్స్ ఒక పోస్ట్, హెడ్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక పోస్టు వుంది.

అలానే డిప్యూటీ CTO కి ఒక పోస్టు వుంది. ఇక వయస్సు వివరాలను చూస్తే.. హెడ్ పోస్టుకి 57 సంవత్సరాలు, హెడ్ IT 45-55 సంవత్సరాలు, DTCO 45-55 సంవత్సరాలు ఉండాలి. అధికారిక వెబ్‌సైట్ www.idbibank.in ద్వారా పూర్తి వివరాలను చూడచ్చు. వేరు వేరు పోస్టులకి వేరు వేరు విద్యార్హతలు వున్నాయి. అభ్యర్థులు [email protected] కి సబ్జెక్ట్ లైన్‌లో పోస్ట్ పేరును వ్రాసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news