ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఉద్యోగాలు.. వివరాలివే..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టులో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఆ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలను చూస్తే.. హైకోర్టులో మొత్తం 76 కోర్టు మాస్టర్ అండ్‌ పర్సనల్ సెక్రటరీ పోస్టులు వున్నాయి. ఇక అర్హత వివరాలను చూస్తే.. ఆర్ట్స్/సైన్స్/కామర్స్ లో కానీ మరే విభాగంలో అయినా కానీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

అలానే ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్ పైన పట్టు ఉండాలి. హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్‌ టైప్ రైటింగ్ పరీక్ష ప్యాస్ అయ్యినట్టు సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి వుంది.

ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్‌ 22, 2022. ఎంపికైన వాళ్లకు నెలకు రూ.57,100ల నుంచి రూ.1,47,760ల వరకు జీతం ఇస్తారు. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. జనరల్ అభ్యర్ధులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.500. షార్ట్‌హ్యాండ్, ఇంగ్లీష్ టెస్ట్, ఇంటర్వ్యూ, ఆధారంగా ఎంపిక చేస్తారు. అధికారిక వెబ్ సైట్ లో పూర్తి వివరాలను చూసి తెలుసుకోవచ్చు.