SBIలో 8904 పోస్టులు.. అర్హత ఏదైనా డిగ్రీ

-

డిగ్రీ పూర్తిచేసి జాబ్‌ కోసం ఎదురు చూస్తున్న వారికి సువర్ణావకాశం. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 8,904 జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్, కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కనీస అర్హత ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ 01.04.2019 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.04.1991 – 01.04.1999 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అప్లికేషన్ ఫీజుగా రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. ఏప్రిల్ 12 నుంచి మే 3 వరకు ఆన్‌లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు.

ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షల ద్వారా ఉద్యోగ ఎంపికలు చేస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో పాస్ అయిన వారు మెయిన్ పరీక్షలకు అర్హత పొందుతారు. అభ్యర్థులకు జూన్‌లో మొదటి విడత పరీక్ష (ప్రిలిమినరీ), ఆగస్టులో రెండో విడత (మెయిన్) పరీక్ష నిర్వహిస్తారు.

పోస్టుల వివరాలు:

జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్): 8,904 పోస్టులు
తెలంగాణ-425
ఏపీ-253

– కేటగిరీ పోస్టులు
– రెగ్యులర్ 8593
– బ్యాక్‌లాగ్ 251
– స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ (రెగ్యులర్) 60
– మొత్తం పోస్టులు 8,904

విభాగాలు: కస్టమర్ సపోర్ట్, సేల్స్.
అర్హత: ఏదైనా డిగ్రీ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

ఎంపిక విధానం:

ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షలు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
– ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 12.04.2019.
– ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ : 03.05.2019.
– దరఖాస్తుల ఎడిట్‌కు చివరితేదీ : 03.05.2019.
– దరఖాస్తులు ప్రింట్ తీసుకోవడానికి చివరితేదీ : 18.05.2019.
– ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ : 12.04.2019 – 03.05.2019.
– ప్రిలిమినరీ పరీక్ష : జూన్‌లో.

మెయిన్‌ పరీక్ష : 10.08.2019.

Read more RELATED
Recommended to you

Latest news