అరెరే.. హైదరాబాద్‌ మళ్లీ ఆఖరే.. హైదరాబాదీ ఓటరు బద్దకం

-

విశ్వనగరంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్‌ అభివృద్ధిలో టాప్‌లో ఉంది గానీ చైతన్యంలో మాత్రం వెనుకబడి ఉన్నట్లనిపిస్తుంది. నగరం ఓటింగ్ శాతంలో మరోసారి నిరాశపరిచింది. హైదరాబాద్‌ యువత ఎలక్షన్స్‌ సెలవులను వెకెషన్స్‌లా ఫీలవుతున్నారేమో.. హైదరాబాదీలు ఓటు హక్కు వినియోగించడంలో బద్దకంగా ఉంటున్నారు. మనకెందుకొచ్చిన ఎలక్షన్స్‌ అనే రీతిలో ఉంది హైదరాబాద్‌ వాసుల మెంటాలిటీ. మనోళ్లు సోషల్‌ మీడియాలో పాలిటిక్స్‌పై రెచ్చిపోయి మరీ కమెంట్లు పెడతారు కానీ ఇళ్లు వదిలి ఓటేయడానికి మాత్రం రారు..

మరీ ఘోరంగా ఈ ఎన్నికల్లో 39.49 శాతం ఓట్లు నమోదు కావడం ఇందుకు నిదర్శనం. ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ నమోదవుతున్న ఓటింగ్ శాతం ఇంచుమించు 50శాతానికి దాటడంలేదు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరీ 39.49 శాతానికి పడిపోవడానికి కారణాలూ ఉన్నాయి.. మొదటిది.. టీఆర్‌ఎస్‌ విజయం ఖాయం కావడం (వార్‌ వన్‌ సైడ్‌). రెండోది.. ఆంద్రప్రదేశ్‌లో ఎన్నికలు ఉత్కంఠగా సాగుతుండటం.. హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్స్‌ అక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మొగ్గు చూపడం. దాదాపుగా హైదరాబాద్‌లో సెటిల్‌ అయిన చాలామందికి ఆంధ్రలో, తెలంగాణలో రెండు చోట్ల ఓటు హక్కు ఉండడం కూడా మూడో కారణం. ఇక నాలుగో కారణం వరుస సెలవులు ఉండటంతో చాలామంది సొంత ఊర్లకు వెళ్లిపోవడం..

మొత్తానికి తెలంగాణలో ఎన్నికలు చప్పగా సాగటం, ఎలాగూ ఒక పార్టీ గెలుస్తుందన్న నమ్మకం కూడా ఓటు శాతం తగ్గడానికి కారణం. పూర్తిగా గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. నగర శివార్లు, గ్రామీణ ప్రాంతాలతో ఉన్న మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్లలో ఓటింగ్ శాతం కాస్త ఫర్వాలేదు. నాంపల్లి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, కంటోన్మెంట్ స్థానాల్లో 50 శాతం కన్నా తక్కువ పోలింగ్ నమోదైంది. పాతబస్తీలో కిందటి సారి కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో పోలింగ్ నమోదు కావడం గమనార్హం.

హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో 39.49 శాతం
సికింద్రాబాద్‌లో 44.99 శాతం
మల్కాజిగిరిలో49.11 శాతం
చేవెళ్లలో 53.08 శాతం

నియోజకవర్గాలవారీగా పోలింగ్‌ శాతం

మలక్‌పేటలో 55.54
అంబర్‌పేట-55.20
గోషామహల్- 50.28
చాంద్రాయణగుట్ట-48.00
బహదూర్‌పురా-49.5
సికింద్రాబాద్- 57.00,
కంటోన్మెంట్-48.90
ముషీరాబాద్-51.34,
ఖైరతాబాద్-54.00,
జూబ్లీహిల్స్-54.60,
సనత్‌నగర్- 52.63,
నాంపల్లి-44.02,
కార్వాన్- 50.89,
చార్మినార్-46.03,
యాకుత్‌పురా -45.00

పోలింగ్‌ శాతం తక్కువగా నమోదు కావడం బాధాకరం అంటూ తెరాస పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరావు గారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

– RK

Read more RELATED
Recommended to you

Latest news