భుసవ‌ల్ రైల్వే డివిజ‌న్‌లో టీచింగ్‌ పోస్టులు.. పూర్తి వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌రైల్వేలో భాగమైన భుసవ‌ల్ రైల్వే లో పలు ఖాళీలు వున్నాయి. భుసవ‌ల్ రైల్వే డివిజ‌న్‌లో ఉన్న స్కూల్ లో పని చెయ్యాల్సి వుంది. మరి ఇక పూర్తి వివరాల లోకి వెళితే..

22 పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌, హిందీ, మ్యాథ్స్‌, ఎక‌నామిక్స్, మ్యూజిక్‌, సైన్స్‌, ఆర్ట్స్ మొదలైన సబ్జక్ట్స్ లో ఈ ఖాళీలు వున్నాయి.

ఇక ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది చూస్తే.. అభ్యర్ధుల వయసు 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌ లో బీఈడీ, ఎమ్మెస్సీ, మాస్టర్స్‌ డిగ్రీ కానీ ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్‌లో రెండేళ్ల డిప్లొమా, బీఈఐఈడీ, బీఏ, బీఎస్సీ, బీఏఈడీ లేదా ఇతర సంబంధిత కోర్సు చేసి ఉండాలి. అదే విధంగా తప్పని సరిగా టెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

అప్లై చేసుకోవడం కోసం చూస్తే.. అర్హత వున్నవాళ్లు డాక్యుమెంట్లతో ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి వుంది. అక్టోబర్‌ 4, 2022వ తేదీన ఇంటర్వ్యూ ఉంటుంది. సాలరీ వివరాలను చూస్తే.. నెలకు రూ.21,250ల నుంచి రూ.27,500ల వరకు జీతంగా ఇస్తారు. పూర్తి వివరాలను http://www.cr.indianrailways.gov.in/ లో చూడచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news