తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..

తెలంగాణ విద్యార్థులకు తీపి కబురు. నిరుద్యోగ సమస్యను పూర్తిగా తగ్గించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉన్న ఉద్యొగాలకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్లను విడుదల చేసింది.ఇప్పటికే పలు సంస్థలలో ఉన్న ఖాళీలను భర్తీ చేశారు.తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు. తెలంగాణ విద్యుత్ శాఖలో ఉన్న ఖాలీలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు.

హైదరాబాద్‌లోని సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ (TSSPDCL) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో 1271 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఖాళీలు ఉన్న పోస్టుల వివరాలు..

అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టులు 70,

సబ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టులు 201,

జూనియర్ లైన్‌మెన్‌ పోస్టులు 1000 ఉన్నాయి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ మే 11నుంచి ప్రారంభమవుతుంది..ఈ ఉద్యొగాలకు సంబంధించిన పూర్తీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ http://tssouthernpower.cgg.gov.inలో చెక్‌ చేసుకోవచ్చు..నిరుద్యొగులకు, విద్యార్థులకు మంచి అవకాశం..వెబ్‌సైట్‌ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు..