ఏపీ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి..రాష్ట్రంలో సంచలన అంశాలపై రాజకీయం నడుస్తుంది. వరుసపెట్టి ఊహించని ట్విస్ట్‌లు వస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు తీవ్రంగా నడుస్తోంది..మధ్యలో పవన్ ఎంట్రీతో సీన్ మారింది. వైసీపీ విశాఖ గర్జన, పైగా విశాఖ ఎయిర్‌పోర్టు ఘటన, పవన్‌ని జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా అడ్డుకోవడం, ఆ తర్వాత విజయవాడలో చంద్రబాబు, పవన్‌ని కలవడం. బీసీ, కాపుల పేరిట వైసీపీ రాజకీయం..కౌంటరుగా టీడీపీ, జనసేన రాజకీయం.
ఇక రాజధాని అంశంపై రగడ..అమరావతి రైతుల పాదయాత్ర, మూడు రాజధానుల కోసం వైసీపీ పోరు, వివేకా హత్యకేసు మలుపులు, షర్మిల వాంగ్మూలం..ఇలా ఏదొక సంచలన అంశం బయటకొస్తూనే ఉంది. తాజాగా టీడీపీ నేత అయ్యన్న పాత్రుడి అరెస్ట్..టీడీపీ శ్రేణుల నిరసన. అయితే ఊహించని అంశం ఏంటంటే పవన్ కల్యాణ్‌పై రెక్కీ నిర్వహించడం. హైదరాబాద్‌లో పవన్ ఇంటి వద్ద, ఆఫీసు వద్ద..గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నట్లు తెలియడం రెండు రాష్ట్రాల్లో సంచలనమైంది. అలాగే పవన్ ఇంటి వద్ద ఉన్న బౌన్సర్లతో కొందరు గొడవ పడటం వారిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగాయి.
అయితే రెక్కీ అంశంపై ఇప్పటికే జనసేన పార్టీ వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్‌ని ఫాలో అయ్యేది అభిమానులు కాదని, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అని తెలిసింది. పైగా వారు వచ్చిన కారులో..ఒక కారుపై ఏపీ రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్ అని ఉంది. దీంతో పవన్ ప్రాణాలకు ముప్పు ఉందని, ఇదంతా వైసీపీనే చేయిస్తుందని జనసేన శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.
కాకపోతే అలా అనుమానాస్పదంగా తిరిగే వారు..ఏ పార్టీకి సంబంధించిన వారు అనేది క్లారిటీ లేదు. రెక్కీ చేసేవారు పవన్‌ని ఫాలో అవుతున్నారా? లేక ఆయనపైన దాడి చేయాలని చూస్తున్నారా? అనేది తెలియదు. ఏదేమైనా గాని విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రులపై జనసేన శ్రేణుల దాడి తర్వాత..పవన్ టార్గెట్‌గా రాజకీయం మారిపోయింది.
ReplyForward |