మూడో వ‌న్డేలో ఇండియా చిత్తు… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

చిట్ట చివరి వన్డే మ్యాచ్‌ లోనూ టీమిండియా దారుణంగా ఓటమి పాలైంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విఫలమౌవడంతో.. జట్టు భారీ మూల్యాన్ని చెల్లిం చుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 287 పరుగులు చేసిఆలౌట్‌ అయింది. డికాక్‌ 124 పరుగులు చేసి.. టాప్‌ స్కోరర్‌ గా నిలిచాడు. ఇక, ఇండియా బౌలర్లలో ప్రసిధ్‌ 3 వికెట్లు తీయగా… చాహర్‌, బుమ్రా రెండేసి వికెట్లు తీశారు. మరోవైపు 288 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 49.2 ఓవర్లలో 283 పరుగులు చేసి పెవిలియన్‌ చేరింది.

దీంతో కేవలం 4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించి… సిరీస్‌ ను ఎగురేసుకుని పోయింది. ఇక.. మూడు వన్డేల సిరీస్‌ ను సఫారీలు 3-0 క్లీన్‌ స్వీప్‌ చేశారు. విరాట్‌ కోహ్లీ 65 పరుగులు, శిఖర్‌ ధావన్‌ 61 పరుగులు, దీపక్‌ చాహర్‌ 54 పరుగులతో ఇండియాను గెలిపించేందుకు తీవ్ర ప్రయత్నమే చేశారు. సూర్య కుమార్‌ 39, శ్రేయస్‌ అయ్యర్‌ 26 పరుగులతో పరవాలేదనిపించినా… విజయం మాత్రం సౌతాఫ్రికా వశం అయింది.