తెలుగు బిగ్‌బాస్‌కు ఓ దండం… టాప్ కంటెస్టెంట్ తీవ్ర విమ‌ర్శ‌లు

-

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 ఫైనల్ స్టేజ్ కి వచ్చేసరికి తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఇంకా చెప్పాలంటే షో పూర్తిగా డ‌ల్ అయిపోయింది. తొలి రెండు వారాల్లో ఉన్న ఆసక్తితో పోలిస్తే 13, 14 వారాల‌కు వచ్చే సరికి టిఆర్పి రేటింగులు పూర్తిగా పడిపోయాయి. చివరకు వీకెండ్‌లో నాగార్జున వస్తున్నా టీఆర్పీలు లేవటం లేదు. ఇక నుంచి బయటకు వస్తున్న కంటెస్టెంట్లు ఈ షోపై పలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని వందల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న హేమ మొదటి వారంలో ఎలిమినేట్ ఇవ్వటంతో అంతా షాక్ తిన్నారు.

అసలు బిగ్‌బాస్ మొదటివారం ఎలిమినేషన్ ఎవరికీ అసలు మింగుడుపడటం లేదు. అందుకే హౌస్ నుంచి బయటకు వచ్చిన వచ్చాక హేమ వీలున్నప్పుడల్లా బిగ్‌బాస్ పై విమర్శలు చేస్తూనే ఉంది. హౌస్‌లో శ్రీముఖి సేఫ్ గేమ్ ఆడుతోంద‌ని విమ‌ర్శ‌లు చేసిన హేమ‌… ఆమె చెప్పేది ఒకటి మనసులో ఉండేది మరోటి అంటూ తీవ్ర విమర్శలు చేసింది. ప్ర‌స్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల విష‌యంలోనూ త‌న‌కు చాలా అనుమానాలు ఉన్న‌ట్టు కూడా ఆమె చెప్పింది.

బిగ్ బాస్ ప్రేక్షకులకు కేవలం చెడును మాత్రమే చూపిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అందుకే బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న‌ప్పుడు ఫేమ‌స్ అయినా… గెలిచి విన్న‌ర్ అయినా కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాక అంత పాపులార్టీ ఉండ‌డం లేద‌ని వాపోయింది. ఇక ఫైన‌ల్ ఎపిసోడ్‌లో పాల్గొనేందుకు రావాల్సిందిగా త‌న‌కు నిర్వాహ‌కులు ఆహ్వానం ప‌లికార‌ని… అయితే బిగ్‌బాస్ షోకు, మీకు ఓ దండి అని ఆ ఆహ్వానం తిర‌స్క‌రించాన‌ని హేమ చెప్పింది.

ఈ క్ర‌మంలోనే ఆమె షోపై మ‌రో తీవ్ర విమ‌ర్శ కూడా చేసింది. బిగ్ బాస్ నుంచి ఎవరు ? ఎలిమినేట్ అయ్యేది ముందే నిర్ణయం జరుగుతుందని ప్రేక్షకుల ఓట్ల ప్రకారం ఈ ఎలిమినేషన్ జ‌ర‌గ‌ద‌ని కూడా చెప్పింది. ఇక బిగ్‌బాస్ ఎడిట‌ర్లు కూడా కేవ‌లం చెడును మాత్ర‌మే చూపిస్తూ టీఆర్పీలు పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని కూడా హేమ విమ‌ర్శించింది.

Read more RELATED
Recommended to you

Latest news