బిగ్‌బాస్ ఫినాలే: ఫ‌స్ట్‌ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసిన రాశీఖ‌న్నా, మారుతి

-

బిగ్‌బాస్ ఫైన‌ల్స్ మంచి ర‌స‌వ‌త్త‌రంగా జ‌రుగుతోంది. ఈ రోజు సాయంత్రం 6 గంట‌ల‌కు మంచి జోష్‌లో స్టార్ట్ అయిన ఈ షోలో ముందు నాగార్జున ఫైన‌ల్స్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్ల ఫ్యామిలీల‌తో లోప‌ల ఉన్న వాళ్ల‌తో మాట్లాడించ‌డంతో పాటు వాళ్ల బిగ్‌బాస్ జ‌ర్నీపై ఫ్యామిలీ స‌భ్యుల అభిప్రాయాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇక బిగ్‌బాస్ టాప్ 5 కంటెస్టెంట్ల‌లో తొలి ఎలిమినేష‌న్‌ను నాగార్జున చాలా ఆస‌క్తిగా చేశారు.

గ్రాండ్ ఫినాలేలో తొలి కంటెస్టెంట్ ఎలిమినేష‌న్ కోసం నాగ్ ఇద్ద‌రు గెస్టుల‌ను తీసుకు వ‌చ్చాడు. ప్ర‌తిరోజు పండ‌గే సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ద‌ర్శ‌కుడు మారుతి, హీరోయిన్ రాశీఖ‌న్నా బిగ్‌బాస్ షోకు వ‌చ్చారు. ముందుగా రాశీతో ఓ సాంగ్ పాడించిన నాగ్ ఆ త‌ర్వాత వారిద్ద‌రిని హౌస్‌లోకి పంపాడు. హౌస్‌లో వారిద్ద‌రు బాబాబో క‌లిసి ఓ పాట‌కు స‌ర‌దాగా స్టెప్పులు వేశారు. ఇక ఈ ఫినాలేలో ముందుగా హౌస్ నుంచి ఎవ‌రు బ‌య‌ట‌కు వ‌స్తారో బిగ్‌బాస్ క‌వ‌ర్ ఓపెన్ చేసి పేరు చ‌ద‌వాల‌ని చెప్పాడు.

అయితే రాశీ, మారుతి క‌వ‌ర్ ఓపెన్ చేసినా కంటెస్టెంట్ పేరు చెప్ప‌లేదు. చివ‌ర‌కు నాగ్ స్వ‌యంగా ముందుగా అలీ ఎలిమినేట్ అవుతున్న‌ట్టు ఎనౌన్స్ చేశాడు. దీంతో గ్రాండ్ ఫినాలేలో ఉన్న టాప్ -5 కంటెస్టెంట్ల‌లో ముందుగా అలీ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అలీని రాశీ, మారుతి బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చారు. ఇక అలీ 50వ రోజున ఎలిమినేట్ అయ్యి.. తిరిగి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news