బిగ్‌బాస్ విన్న‌ర్ రాహుల్‌… జ‌గ‌న్ ఎలా హెల్ఫ్ అయ్యాడు..

-

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ చూసినా బిగ్ బాస్..బిగ్ బాస్..బిగ్ బాస్ అన్న షో మార్మోగిపోతోంది. తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 3 ఫినాలే ఇప్ప‌టికే స్టార్ట్ అయ్యింది. ప్ర‌స్తుతం అంద‌రూ ఫినాలే మాయ‌లో ఊగిపోతున్నారు. ఇక టాప్ 5 కంటెస్టెంట్ల‌లో ఐదుగురు ఉన్నా వీరిలో మొయిన్‌గా యాంకర్ శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. వీరిద్ద‌రిలో ఎవ‌రు విన్న‌ర్‌గా నిలుస్తార‌నేది మ‌రో రెండు గంట‌ల్లో తేలిపోనుంది.

ఇక ఇప్ప‌టికే ఓటింగ్ ప్ర‌క్రియ కంప్లీట్ కావ‌డంతో ఎవ‌రు విన్ అవుతారో ? అని అంద‌రూ ఆస‌క్తితో ఉన్నారు. మ‌రోవైపు షోలో డ్యాన్సులు, హీరోయిన్లు, డైరెక్ట‌ర్ల ఎంట్రీతో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇక హౌస్‌లో ముందు నుంచి హీరో వ‌రుణ్ సందేశ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్‌, మిస్ట‌ర్ కూల్‌గా ఉన్న వ‌రుణ్ శ్రీముఖికి గ‌ట్టిపోటీ దారుడిగా ఉన్నాడు. అయితే చివ‌ర‌కు వ‌చ్చేస‌రికి సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ అనూహ్యంగా అంద‌రిని వెన‌క్కి నెట్టేసి ఫైన‌ల్లో శ్రీముఖికి పోటీ ఇచ్చాడు.


ఏకంగా 10 వారాలు ఎలిమినేట్ అయిన రాహుల్ ప‌ది సార్లు కూడా సేఫ్‌గా ఎలిమినేష‌న్ నుంచి త‌ప్పించుకున్నాడు. ఇక ఇప్పుడు రాహుల్ విన్ అయిన‌ట్టు సోష‌ల్ మీడియాలో ట్రెండ్స్ న‌డుస్తున్నాయి. రాహుల్‌కు శ్రీముఖి కంటే ఎక్కువ ఓట్లు రావ‌డం వెన‌క ఏపీ సీఎం జ‌గ‌న్ ఉన్న‌ట్టు వైసీపీ అభిమానులు చెపుతున్నారు. రాహుల్ ఎన్నికలకు ముందు జగన్‌ ఇమేజ్‌ను హైలెట్ చేస్తూ అదిరిపోయే రేంజ్‌లో ఓ పాట పాడాడు.

ఆ పాట అప్ప‌ట్లో జ‌గ‌న్ ఫ్యాన్స్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. అందుకే ఇప్పుడు రాహుల్‌కు జ‌గ‌న్ ఫ్యాన్స్‌, వైసీపీ అభిమానులు భారీగా ఓట్లు వేసి మ‌రీ అత‌డిని గెలిపించాల‌ని చాలా భారీగా ఫ్రీ క్యాంపెయిన్ నిర్వ‌హించారు. మ‌రి జ‌గ‌న్ ఫ్యాన్స్‌, వైసీపీ కార్య‌క‌ర్త‌ల ఓట్లు రాహుల్‌కు ఎంత వ‌ర‌కు యూజ్ అయ్యాయి ?  రాహుల్ విన్న‌ర్ అయ్యాడా ?  లేదా ? అన్న‌ది కొద్ది నిమిషాల్లోనే తేలిపోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news