నాన్నే రియల్ హీరో..!

-

తన పిల్లలు మంచిగా ఉండాలని.. ఎటువంటి కష్టాలకు గురి కావద్దని.. సంతోషంగా బతకాలని.. నిజాయితీగా కొరుకునేది ఒక నాన్న మాత్రమే. దాని కోసం.. తన జీవితాన్ని పణంగా పెట్టి మరీ తన పిల్లలను పెంచి పెద్ద చేస్తాడు. వాళ్లకు ఓ దారి చూపిస్తాడు.

అవును.. నాన్నే రియల్ హీరో. నాన్నే తన పిల్లలకు రియల్ హీరో. పిల్లలు తమ తండ్రినే హీరోగా భావిస్తున్నారు. నిజానికి తండ్రిని గౌరవించడానికి కేవలం ఒక రోజు సరిపోదు. జీవితాంతం.. పిల్లలు బతికున్నంత వరకు తమ నాన్నను గౌరవిస్తూనే ఉండాలి… ప్రేమను, అభిమానాన్ని చూపిస్తూనే ఉండాలి.

తన పిల్లలు మంచిగా ఉండాలని.. ఎటువంటి కష్టాలకు గురి కావద్దని.. సంతోషంగా బతకాలని.. నిజాయితీగా కొరుకునేది ఒక నాన్న మాత్రమే. దాని కోసం.. తన జీవితాన్ని పణంగా పెట్టి మరీ తన పిల్లలను పెంచి పెద్ద చేస్తాడు. వాళ్లకు ఓ దారి చూపిస్తాడు. వాళ్లకు దారి చూపించే సమయంలో తన దారినే మరిచిపోతాడు. తన జీవితాన్నే త్యాగం చేస్తాడు. ధార పోస్తాడు. తన జీవితాన్ని చీకటిమయం చేసుకుంటూ తన పిల్లల జీవితాల్లో వెలుగు నింపుతాడు నాన్న. అందుకే నాన్న రియల్ హీరో. నాన్నే పిల్లలకు రియల్ హీరో. నాన్నే పిల్లలకు ఫస్ట్ అండ్ లాస్ట్ హీరో.

తన పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలని.. ఆనందంగా బతకాలని కోరుకునే ఏకైక వ్యక్తి నాన్న. తల్లి తన బిడ్డను తొమ్మిది నెలలే కడుపులో మోస్తుంది కానీ… తండ్రి మాత్రం జీవితాంతం తన పిల్లలను మోయాలి. తండ్రికి తన భవిష్యత్తు కన్నా తన పిల్లల భవిష్యత్తే ముఖ్యం. అందుకే… తండ్రికి తగ్గ తనయుల్నా పిల్లలు తండ్రిని ఎప్పుడూ కించపరచకుండా.. ఆయన్ను ఎప్పుడూ ఓ హీరోలా చూసుకోవాలి. రియల్ హీరోలా చూసుకోవాలి. గౌరవించాలి. అప్పుడే నాన్న పిల్లలపై చూపే ప్రేమకు సార్థకత.

జూన్ 16న ప్రపంచ తండ్రుల దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని తండ్రులందరికీ తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు. నిజానికి.. తండ్రిని గౌరవించడానికి ఒక్క రోజు సరిపోదు. పిల్లలు తమ జీవితాంతం తండ్రిని గౌరవించాలి.. ప్రేమించాలి.. ఆరాధించాలి… హత్తుకోవాలి… ఆదుకోవాలి… అదే వాళ్లు తమ తండ్రికి ఇచ్చే కానుక. తమ పిల్లల నుంచి తండ్రి కోరుకునేది కూడా అదే. ఆ ప్రేమను మీ తండ్రికి అందించండి.

Read more RELATED
Recommended to you

Latest news