తను కరిగిపోతూ పిల్లల జీవితంలో వెలుగులు నింపే నాన్నకు జోహార్లు..

-

పిల్లలకి తల్లి అంటే ఎంత ప్రేమ ఉంటుందో, తండ్రి అంటే కూడా అంతే ప్రేమ ఉంటుంది.. అయితే నాన్న గంభీరంగా ఉంటారు అందుకే నాన్నకు కొద్దిగా భయ పడతారు..ఏదైనా నాన్నకు ఇబ్బంది కలిగితే మాత్రం అర సెకను కూడా ఆగరు..అదే పిల్లలకు,నాన్నకు ఉన్న అనుబంధం..తల్లి జన్మనిస్తే, తండ్రి తన పిల్లల్ని కాపాడడానికి, తన పిల్లల కనే ప్రతి కలని నెరవేర్చడానికి జీవితాంతం కష్టపడతాడు.తాను ఎన్నో త్యాగాలను చేసి పిల్లల మొహంలో సంతోషాన్ని చూడాలని అనుకుంటారు.

ఒక తండ్రి తన జీవితమంతా పిల్లల భవిష్యత్తుకు పునాది వేయడానికి, వారి చిన్న, పెద్ద అవసరాలను తీర్చడానికి తన జీతాన్ని జీవితాన్ని వెచ్చిస్తాడు. అయితే తండ్రి ప్రేమని త్యాగాన్ని గుర్తిస్తూ.. నాన్నకి ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పము. కనీసం ఒక్కరోజైనా రాత్రింబగళ్లు కష్టపడే నాన్న కృషి, ప్రేమ. తండ్రి ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఫాదర్స్ డే జరుపుకుంటారు. ఇదినాన్నని గౌరవించే రోజు. ఈ రోజున మీరు మీ తండ్రికి ప్రత్యేక అనుభూతిని ఇచ్చే విధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి..

తండ్రి గొప్పదనం గురించి తెలుపుతూ.. గుర్తింపుకి ఒక రోజు ఉండాలంటూ ప్రచారం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో అమెరికాలో మొదటిసారి ఫాదర్స్ డే ను గుర్తించి జరుపుకున్నారు.. అనంతరం 1916 సంవత్సరంలో US అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ ఫాదర్స్ డేని జరుపుకోవాలనే సూచనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 1966 సంవత్సరంలో, ప్రెసిడెంట్ లిండన్ జాన్సన్ జూన్ మూడవ ఆదివారం నాడు ఫాదర్స్ డేని జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించారు.అలా అప్పటి నుంచి ఈ ఫాధర్స్ డేను జరుపుకుంటున్నారు..

ఆరోజు ప్రత్యేకంగా నాన్నకు దగ్గిరగా ఉండి, చిన్నప్పటి నుంచి గడిపిన మెమొరీస్ ను గుర్తు తెచ్చుకోవడం, కాస్త సరదాగా గడపడం అతని నచ్చిన విధంగా చెయ్యడం,సంతోషంగా గడపండి..ఆయన చేసిన త్యాగాలకు ఇది గుర్తు అని మర్చిపోలేని సంతోషాన్ని అందించండి..ఇదే మీరు నాన్నకు ఇచ్చే మరుపురాని గిఫ్ట్..

Read more RELATED
Recommended to you

Latest news