నాన్నకు ఆ విషయం చెప్పడానికి చాలా భయపడ్డా: తమన్నా

-

జూన్ 16న తండ్రుల దినోత్సవం సందర్భంగా తమన్నా.. తండ్రి గురించి ఇటువంటి ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది.

మామూలుగా డాక్టర్ కాబోయి.. యాక్టర్ అయ్యాను.. అని చాలా మంది చెబుతుంటారు. కానీ.. తమన్నా మాత్రం యాక్టర్ కావాలనుకొనే యాక్టర్ అయింది. తనకు సినిమాలంటే పిచ్చి. ప్రాణం. చిన్నప్పటినుంచి అంతే. సినిమాలంటే తమన్నా పడి చచ్చిపోయేది.

కానీ.. అన్ని కుటుంబాల్లో సినిమా అనే సరికి వద్దంటారు కదా. అందుకే.. తన నాన్నకు సినిమాల్లోకి వెళ్తా అనే విషయం చెప్పడానికి తమన్నా చాలా భయపడిందట. నాన్న ఏమంటారో అని తెగ టెన్షన్ పడిందట. తమన్నాకు తన నాన్న అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆమెకు ఏదీ అడగకముందే.. తన అవసరాలను గమనించి ఇచ్చేవారట. కానీ.. సినిమాల్లోకి వెళ్తానని చెబితే ఎక్కడ తన నాన్న వద్దంటాడోనని చాలారోజులు బాధ పడిందట. కానీ.. తన సినిమా పిచ్చి తనను ఒకచోట నిలవనీయలేదు. ఒకరోజు ధైర్యం అంతా కూడగట్టుకొని తన తండ్రికి సినిమాల్లోకి వెళ్తా అనే విషయం చెప్పేసిందట తమన్నా.

దానికి చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారట తమన్నా నాన్న. నీ మీద నీకు నమ్మకం ఉంటే తప్పకుండా వెళ్లు. కానీ ఎప్పుడూ మంచిదారిలోనే నడవాలి… అని తమన్నా తండ్రి అన్నారట.

జూన్ 16న తండ్రుల దినోత్సవం సందర్భంగా తమన్నా.. తండ్రి గురించి ఇటువంటి ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news