నాన్నే సర్వస్వం.. హ్యాపీ ఫాదర్స్ డే..!

-

నాన్న ఎప్పుడూ పిల్లలతో ఉండకపోవచ్చుగాక కానీ.. తను ఎప్పుడూ పిల్లల మంచే కోరుతారు. తన భార్య, తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా తన పిల్లలను ప్రేమిస్తాడు నాన్న. నాన్న తన పిల్లల నుంచి ఆశించేది డబ్బు కాదు.. ఆస్తులు కాదు.. అంతస్తులు కాదు.. కాసింత ప్రేమ.

అవును.. కొడుకుకైనా.. కూతురుకైనా నాన్నే సర్వస్వం.. నాన్నే సమస్తం. నాన్న లేకపోతే వాళ్ల జీవితమే లేదు. పిల్లలు పెరిగి పెద్దయి వాళ్ల కాళ్ల మీద వాళ్లు బతుకుతున్నారంటే అది కేవలం తండ్రి చలవే. అందుకే తండ్రి రుణం తీర్చుకోలేనిది. ఏమిచ్చినా తండ్రి తన పిల్లలకు ఇచ్చిందాన్ని తీర్చుకోలేం. తన జీవితాన్ని త్యాగం చేస్తాడు నాన్న. ప్రతి కొడుకు, కూతురు జీవితంలో నాన్న పాత్ర మరువలేనిది. గొప్పది. మహనీయమైనది. నాన్న ఎప్పుడూ పిల్లల గుండెల్లో ఉంటాడు.. ఉండాలి కూడా. అదే మనం నాన్నకు ఇచ్చే గౌరవం.

నాన్న ఎప్పుడూ పిల్లలతో ఉండకపోవచ్చుగాక కానీ.. తను ఎప్పుడూ పిల్లల మంచే కోరుతారు. తన భార్య, తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా తన పిల్లలను ప్రేమిస్తాడు నాన్న. నాన్న తన పిల్లల నుంచి ఆశించేది డబ్బు కాదు.. ఆస్తులు కాదు.. అంతస్తులు కాదు.. కాసింత ప్రేమ. ఆయన మీద కాసింత ప్రేమ కురిపిస్తే చాలు.. ప్రేమగా నాన్నా.. అని పిలుస్తే చాలు.. నాన్న మనసు పులకరించిపోతుంది. నాన్న తనకున్న కష్టాలను కూడా మరిచిపోతాడు. తన పిల్లల కోసం ఇంకా ఏదైనా చేయాలనుకుంటాడు. అటువంటి నాన్నకు ఒక రోజు సరిపోదు. సంవత్సరం మొత్తం నాన్న రోజులే ఉండాలి.

అయితే.. ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారం ప్రపంచ తండ్రుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు.. అంటే దాని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. 1910లో వాషింగ్టన్ లో ప్రపంచ నాన్నల దినోత్సవం ప్రారంభం అయింది. కాకపోతే 1972 లో తండ్రుల దినోత్సవానికి గుర్తింపు వచ్చింది. పిల్లల కోసం తన జీవితాన్ని ధారపోసే తండ్రుల కోసం సంవత్సరంలో ఒక రోజు ఉండాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఫాదర్స్ డేను ప్రారంభించారు.

తల్లులకు గౌరవంగా ప్రపంచ మాతృ దినోత్సవం ఉంది కదా. అయితే.. తల్లులతో పాటు.. పిల్లల ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషించి బాధ్యతకు మారుపేరుగా నిలిచే తండ్రికి కూడా ఒక రోజు ఉండాలని యూఎస్ కు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఈ ప్రచారాన్ని మొదలు పెట్టింది. అలా… వాషింగ్టన్ లో మొదటి సారి 1910లో ప్రపంచ నాన్నల దినోత్సవాన్ని జరిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాలు ప్రపంచ తండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఆ దేశాలన్ని కలిసి జూన్ మూడో ఆదివారాన్ని ప్రపంచ తండ్రుల దినోత్సవంగా జరుపుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news