టీచర్స్ డే స్పెషల్: టీచర్ల గొప్పతనాన్ని తెలియజేసే కొటేషన్లు ఇవే..!!

-

తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని గురువులకు ఇస్తారు..ప్రపంచాన్ని తన మాటలతో చెబుతాడు..అందుకే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమః’’. గురువు లేనిదే విద్య లేదు.. విద్య లేనిదే జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోతే.. ఈ లోకం మనుగడే ఉండదు..గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు.మనకు ప్రత్యక్ష దైవం. గురుపూజోత్సవం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ గురువుల సేవలను గుర్తు చేసుకోవాల్సిందే..

ఎప్పుడూ చెప్పే విధంగా కాకుండా కొత్తగా గురువులకు శుభాకాంక్షల తెలుపుదాము..కొన్ని ప్రత్యెకమైన కొటేషన్లను ఇప్పుడు చుద్దాము…

*. ఈ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా.. వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అందుకే ఆ వృత్తి అంటే నాకు ఎంతో గౌరవం – అబ్దుల్ కలాం
– ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

*. విద్యార్థి జీవితాన్ని మలిచేది గురువే
– గురుపూజోత్సవ శుభాకాంక్షలు
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

*. బడి, బాధ్యత, భవిష్యత్తుని పరిచయం చేసిన మా గురువులకి..
– ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

*. చదివి అర్థం చేసుకున్నప్పుడే దానికి విలువ. లేకపోతే అట్టి చదువరికి, చెదపురుగుకు తేడా లేదు.
– గురుపూజోత్సవ శుభాకాంక్షలు

*. ఉత్తమమైన వ్యక్తిని తయారు చేయడమే విద్య పరమార్థం.
అది గొప్ప ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది.
– ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

*. శిష్యుల ఎదుగుదలే గురు దక్షిణగా భావించే పూజ్యులైన గురువుగారికి.. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

*. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర:
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమ:
– గురుపూజోత్సవ శుభాకాంక్షలు

*. నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడే..
మంచి విద్యావంతులను తయారు చేయగలడు..
– ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

*. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో..
భూమిని చూసి ఓర్పును నేర్చుకో..
చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో..
ఉపాధ్యాయుడిని చూసి సుగుణాలు నేర్చుకో..
– ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

*.అ, ఆ లనుంచి గుణింతాల వరకు, అంకెల నుంచి లెక్కల వరకు, పిల్లల పాటల నుంచి చరిత్ర వరకు, ఆటల నుంచి సైన్స్ వరకు అన్నీ దండించైనా దగ్గరుండి నేర్పించిన ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి నమస్కరించాలి..
ఈ కొటేషన్స్ తో మీ ప్రియమైన గురువుకు శుభాకాంక్షలు తెలపండి..గురువులందరికి గురుపూజోత్సవ శుభాకాంక్షలు..

Read more RELATED
Recommended to you

Latest news