దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు ‘తెలంగాణ రన్’

-

తెలంగాణ రాష్ట్ర అవతరణ  దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రోజున సాహితిదినోత్సవం ఘనంగా జరిగింది. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి సమావేశమయ్యారు.

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న తెలంగాణ రన్ కార్యక్రమంపై అధికారులతో సీఎస్ చర్చించారు. తదుపరి రోజుల్లో నిర్వహించాల్సిన మహిళా దినోత్సవం, వైద్య ఆరోగ్య దినోత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లతో  టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కార్యక్రమంలో డీజీపీ అంజనీ కుమార్, వివిధ శాఖల కార్యదర్శులు,  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో ఘనంగా తెలంగాణ రన్ నిర్వహించాలని, ఈ రన్ లో ప్రజాప్రతినిధులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు భాగస్వామ్యం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ నుంచి తెలంగాణ రన్ ప్రారంభమవుతుందని… ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులతో పాటుగా క్రీడాకారులు, గాయకులు, దాదాపు 4 వేలకు పైగా రన్నర్లు పాల్గొననున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌మార్గ్‌, నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version