నేటి నుండి ధనుర్మాసం.. పెళ్లి కానీ ఆడవాళ్ళు ఇలా చేస్తే చాలా మంచిది..!

-

ధనుర్మాసం లో తీర్థయాత్రలకు వెళ్తూ వుంటారు. అలానే ధనుర్మాసం లో భగవంతుడిని ఆరాధిస్తూ వుంటారు. ధను సంక్రాంతి సమయంలో విష్ణుమూర్తికి ప్రత్యేకమైన పూజలని చేస్తుంటారు. ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనం, గోదా దేవి కళ్యాణం వంటి వాటిని ధనుర్మాసం లో నిర్వహిస్తారు.

వైష్ణవులు అయితే పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి ధనుర్మాస వ్రతాన్ని చేస్తారు. ఈ నెల అంటే విష్ణు మూర్తి కి చాలా ఇష్టం. నదీ స్నానాలు, పూజలు, జపాలు వంటి పుణ్య కార్యాలని ధను సంక్రమణ కాలంలో చేస్తే చాలా మంచి జరుగుతుంది. బ్రహ్మ ముహుర్తంలో నారాయణ పారాయణం చేస్తే ఆ భగవంతుడి ఆశీస్సులు పొందొచ్చు.

అలానే ఈ నెల లో పెళ్లి కాని కన్యలు ఇళ్ల ముందు ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజలు చేస్తే చాలా మంచిది. అందుకే చాలా మంది గొబ్బెమ్మలు పెట్టి, వాటి మీద బియ్యం పిండి, పసుపు, కుంకుమలతో పూజిస్తారు. పూల తో కూడా పూజిస్తారు. గోదా దేవి మార్గళి వ్రతం పేరిట మహా విష్ణు మూర్తి ని పూజిస్తే మోక్షం వస్తుంది. తిరుప్పావై పారాయణం చేస్తే వివాహం కానీ వారికి వివాహం అవుతుంది. కానీ ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా ఈ నెల లో ఆచరిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. అనుకున్నవి జరుగుతాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news