సమాజం కన్న కలలకి విలువ ఇస్తే నీ కల ఎవరు సాధిస్తారు…

Join Our Community
follow manalokam on social media

ఇక్కడ ప్రతీ ఒక్కరికీ కల ఉంటుంది సార్. ఎవడి కల వాడికి గొప్పది. నీ కల నాకు నచ్చదు. నా కల మీకు నచ్చదు అని బిజినెస్ మేన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అవును అందరూ కలలు కంటారు. కలలు నిజమవ్వాలని తపిస్తూ ఉంటారు. అందుకు చేయాల్సిన పనులని చేస్తూ ఉంటారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేసుకుని మళ్ళీ కొత్త కల కందామని చూస్తూ ఉంటారు. ఐతే నువ్వు కంటున్న కల నిజంగా నీదేనా అన్నది నువ్వు చెక్ చేసుకోవాలి.

చిన్నప్పటి నుండి పెద్దయ్యే వరకు సమాజం మన మీద ఎన్నో కలల్ని రుద్దుతూ ఉంటుంది. ఎల్ కేజీ కి వెళ్తున్నప్పుడే నువ్వేమవ్వాలి అనుకుంటున్నావో చెప్పమంటుంది. వాడు పెద్దయ్యాక అలా అవుతాడా లేదా అన్నది పక్కన పెడితే, సమాజం మాత్రం అడుగుతూనే ఉంటుంది. సమాజంలో పేరున్న డాక్టర్, ఇంజనీర్, లాయర్ వంటి వాటిపైనే కలలు కనేలా ప్రోత్సహిస్తుంది. అదే మీ కల అన్నట్టు భ్రమిస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి. మీరు కంటున్న కల నిజంగా మీదేనా?

ఎవరో చెప్తే తప్ప మీ కల గురించి మీకు తెలియట్లేదా? కలలు కూడా మీ సొంతం కావా? కల మీ సొంతం కానప్పుడు నువ్వు చేసే పని నీకు ఆనందాన్ని ఎలా ఇవ్వగలుగుతుంది. అందుకే ప్రపంచంలో ఆనందం అన్న పదం అందరిలో కనిపించట్లేదు. ఎప్పుడూ విషాదంగా ఉండడమో, ఒత్తిడికి తట్టుకోక నిరాశలోకి దిగడమో చేస్తున్నారు. దానికి కారణం నీ కలని నువ్వు సరిగ్గా గుర్తించకపోవడమే.

జీవితం చాలా చిన్నది. కరోనా వచ్చిన తర్వాత ఈ విషయం అందరికీ అర్థమైంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియని జీవితంలో మీకు నచ్చే కలలు కనండి. అప్పుడే జీవితం సాఫీగా సాగి, మీరనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...