ఇతరులు ఏమి చెప్పినా వింటూ పోతే.. చివరకు మిగిలేది ఏమిటి..?

-

ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తూ ఉండాలి. అనుకున్నది సాధిస్తూ ఉండాలి. వీలైనంతవరకు కష్టపడి అనుకున్న దాని మీద పూర్తి ఏకాగ్రత పెడితే గెలుపు తథ్యం. అయితే చాలా మందికి నిర్ణయం తీసుకోవడం రాదు. నిర్ణయాలు తీసుకోకపోవడంతో వాళ్ళు చెప్పినది వీళ్ళు చెప్పింది వింటూ ఉంటారు. కానీ అలా వినడం కరెక్టే అయినప్పటికీ కూడా మీరు నిర్ణయాలు మీరు తీసుకోకపోవడం వలన మీ జీవితంలో మీరు ముందుకు వెళ్లడానికి అవ్వదు.

పైగా అన్నిసార్లు కూడా ఇతరులు సరైన నిర్ణయాలు తీసుకుంటారా లేదా అనేది మనం చెప్పలేము. వారికి అనుగుణంగా మిమ్మల్ని వాడుకుంటారు తప్ప మీ ప్రయోజనం కోసం వాళ్ళు ఆలోచించరు. దీని వలన మీ భవిష్యత్తు ఇబ్బంది పడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా శక్తి, సామర్థ్యం ఉంటుంది. ఆలోచనా శక్తి ఉంటుంది. పైగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కోరిక ఉంటుంది. ఏదైనా సాధించాలని ఉంటుంది. అనుకున్న దాని కోసం కృషి చేయాలని ఉంటుంది.

అలాంటప్పుడు మీ ఆశయానికి తగ్గట్టుగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అంతే తప్ప ఎదుటి వాళ్ళు చెప్పినది ఆచరించకూడదు. ప్రతిసారి ఇతరులు ఇచ్చిన సలహాలని మీరు పాటిస్తే అది నిజంగా మీ మూర్ఖత్వం. ఏ విషయంలోనైనా మీకే క్లారిటీ ఉండాలి కచ్చితంగా మీరు ఆ పనిని ఎందుకు చేస్తున్నారు అనేది మీకు తెలిసి ఉండాలి. అలా కాకుండా మీరు ఇతరులు చెప్పినట్లుగానే అనుసరిస్తూ ఉంటే కచ్చితంగా సమస్యలు వస్తాయి దాని వలన మీ భవిష్యత్తు కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఈరోజు నుండి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టండి. మీ ప్రయోజనాలు కోసం మీ భవిష్యత్తు కోసం ఆలోచించండి. ఈ విధంగా మీరు మార్పులు చేసుకుంటే కచ్చితంగా జీవితంలో పైకి రాగలుగుతారు.

Read more RELATED
Recommended to you

Latest news