విజేతల మనస్తత్వాల్లో కామన్ గా కనిపించే అంశాలు..

విజేతలనే ప్రపంచం గుర్తుంచుకుంటుంది. దానికి పరాజితుల గురించి అసలు పట్టనే పట్టదు. అందుకే ప్రతీ ఒక్కరూ విజయం కోసమే పరుగెడతారు. ఐతే విజేతలు మనస్తత్వాల్లో కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. ఆ కామన్ పాయింట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నువ్వు నారింజ గింజ భూమిలో పాతిపెట్టి ఆపిల్ కాస్తలేదని ఎదురుచూస్తే ఏం లాభం. అంటే నువ్వు దేన్నైతే కోరుకుంటున్నావో దానికి తగ్గట్లుగానే నీ చర్యలు ఉండాలి. ఎంత పెద్దదాన్ని కావాలనుకుంటారో అంత పెద్దగానే చర్యలు జరుపుతారు.

అహం నిన్ను దెబ్బతీయవచ్చు. జీవితంలో అహన్ని వదిలిపెట్టాలి. జీవితంలో ముందుకు వెళ్ళనీయకుండా చేస్తే మాత్రం నిర్దాక్షిణ్యంగా వదులుకోవాల్సిందే. ఈ విషయం విజేతలకి బాగా తెలుసు.

ఒక పని వల్ల నేకేం వస్తుందో కాదు. ఆ పని వల్ల నువ్వెలా తయారవుతున్నావో ఆలోచించాలి. నిన్ను తప్పు దార్లోకి తీసుకెళ్ళే అంశాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది.

ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశను మీ దరికి రానివ్వవద్దు. రానిస్తే అవి తిష్ట వేసుకుని మీలోనే కూర్చుంటాయి. వాటికి మీరు స్వాగతం పలికితే మీరు వెళ్ళమన్నా అవి వెళ్ళవు.

ఒక విషయం ఐదు సంవత్సరాల తర్వాత దాని పనిలేకపోతే దాని అవసరం ఇప్పుడు కూడా లేనట్టే. చిన్న చిన్న విషయాల గురించి విజేత ఆలోచించడు.

సంతోషాన్నిచ్చే పనులు చేస్తే ప్రజలు మీకు ఆకర్షితులు అవుతారు. హాయిగా నవ్వే వారి వద్దకే మరొకరు వస్తారు. ఏడుస్తూ కూర్చుంటే ప్రపంచం అలాగే వదిలిపెడుతుంది. ఒకవేళ వచ్చినా ఆ ఏడుపుని మరింత ఎక్కువ చేయడానికే కానీ తగ్గించడానికి కాదు. అందుకే విజేతలుగా ఆలోచించండి.