మే రెండో వారం వ‌ర‌కు భార‌త్‌లో 13 ల‌క్ష‌ల క‌రోనా కేసులు..?

-

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే మే రెండో వారం పూర్త‌య్యేస‌రికి దేశంలో మొత్తం 1 ల‌క్ష నుంచి 13 లక్ష‌ల వ‌ర‌కు క‌రోనా కేసులు న‌మోద‌య్యేందుకు అవకాశం ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఈ మేర‌కు అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు తాజాగా ఓ నివేదిక‌ను విడుద‌ల చేశారు.

corona confirmed cases in india might climb up to 13 lakhs  till may 2nd week

ప‌రిశోధ‌కులు చెబుతున్న ప్ర‌కారం.. ప్ర‌స్తుతం దేశంలో కరోనా టెస్టుల‌ను వేగంగా చేసేందుకు, త్వ‌ర‌గా కేసుల‌ను నిర్దారించేందుకు త‌గిన సౌక‌ర్యాలు లేవ‌ని, అందువ‌ల్ల ప్ర‌స్తుతం చెబుతున్న కేసుల క‌న్నా ఇంకా ఎక్కువ మందికే క‌రోనా ఉండి ఉంటుంద‌ని వారంటున్నారు. అయితే ఈ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని క‌రోనా వ్యాప్తి కేసుల సంఖ్య‌ను అంచ‌నా వేస్తే.. మే రెండో వారం పూర్త‌య్యే స‌రికి మ‌న దేశంలో 1 ల‌క్ష నుంచి 13 ల‌క్ష‌ల వ‌ర‌కు క‌రోనా కేసులు న‌మోద‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. అందువ‌ల్ల భార‌త్ ముందు ముందు ఇంకా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వారంటున్నారు.

ఇక ఇత‌ర దేశాల‌తో పోలిస్తే భార‌త్‌లో ప్ర‌తి 1000 మంది భార‌తీయుల‌కు హాస్పిట‌ళ్ల‌లో అందుబాటులో ఉన్న బెడ్స్ సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంద‌ని, అందుక‌ని ఆ విష‌యంతోపాటు.. ఐసీయూ, ఐసొలేష‌న్ వార్డుల‌ను కూడా పెంచుకుంటే.. రాబోయే రోజుల్లో ఎలాంటి విప‌రీత‌మైన ప‌రిణామాలు ఏర్ప‌డినా.. భార‌త్ ధైర్యంగా ఎదుర్కొనేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని.. ప‌రిశోధ‌కులు అంటున్నారు. మ‌రి ఈ విష‌యంలో ప్ర‌భుత్వాలు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటాయో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news