Corona: ఇండియాాలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

-

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా ఇండియాలో తక్కువగానే కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. 3000కు దిగువనే కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే బీఏ4, బీఏ 5 ఓమిక్రాన్ సబ్ వేరియంట్లకు సంబంధించి కేసులు నమోదు కావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 2703 కేసులు నమోదు అయ్యాయి. ఇది ఆదివారంతో పోలిస్తే( 2828) తక్కువ. అయితే మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. ఒక్క రోజులోనే కరోనాతో దేశ వ్యాప్తంగా 25 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసుల సంఖ్య 17,698గా ఉంది. కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి గమనిస్తే కోలుకున్న వారి శాతం 98.74 గా ఉంది. మొత్తంగా 4,26,13,440 మంది రికవరీ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 2070 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య 5,24,611 కు చేరుకుంది. టోటల్ మరణాల శాతం 1.22గా ఉంది. దేశంలో అర్హులైన వారికి 193,31,57,352 టీకా డోసులు అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news