పిల్లలకు కూడా కరోనా వైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ అవసరమని ఒక సర్వే స్పష్టం చేస్తుంది. పిల్లలు కూడా ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడటం వల్ల ఇప్పుడు వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించాలని ఆక్స్ఫర్డ్ ప్రచురించిన తాజా అధ్యయనం తెలిపింది. పెద్దలకు కరోనావైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ 3 వ దశకు చేరుకున్నా ఇంకా పిల్లల కోసం మొదలు పెట్టలేదు అని ఆక్స్ఫర్డ్ అధ్యయనం తెలిపింది. పిల్లలలో కరోనా వైరస్ ప్రభావం గమనించిన దానికంటే “ఎక్కువ” అని ఆక్స్ఫర్డ్ అధ్యయనం తెలిపింది.
కరోనా వైరస్ ప్రసారంలో పిల్లల పాత్ర తక్కువగా అంచనా వేయబడిందని పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. “పిల్లలపై కరోనా వైరస్ యొక్క ప్రత్యక్ష ప్రభావం అనేక ఇతర వ్యాధికారక కారకాలకు గమనించిన దానికంటే ఎక్కువగా ఉంది, దీని కోసం మనకు ఇప్పుడు సమర్థవంతమైన పీడియాట్రిక్ టీకాలు ఉన్నాయి” అని ఆక్స్ఫర్డ్ అధ్యయనం స్పష్టం చేసింది. పిల్లలలో ఫేజ్ 2 కరోనా వైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఆలస్యం చేస్తే కరోనా నుంచి కోలుకోవడం ఆలస్యం అవుతుందని పరిశోధకులు చెప్తున్నారు.
ఇది “పిల్లల విద్య, ఆరోగ్యం మరియు మానసిక శ్రేయస్సుపై అనవసరంగా ప్రభావాన్ని పొడిగిస్తుంది” అని వారు అభిప్రాయపడ్డారు. “పీడియాట్రిక్ టీకాల యొక్క ప్రత్యక్ష మరియు పరోక్ష ప్రయోజనాలను ఆధారంగా… కరోనావైరస్ వ్యాక్సిన్ల కోసం రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగించడం ఇప్పుడు ప్రారంభించాలని సర్వే పేర్కొంది. పిల్లలలో కరోనా వైరస్ వ్యాక్సిన్ల యొక్క భద్రత మరియు సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడం క్లిష్టమైన దశ అని వివరించారు. పిల్లలను పెద్దలను రక్షించడానికి పిల్లలలో కరోనా వైరస్ వ్యాక్సిన్ల యొక్క భద్రత, రోగ నిరోధక శక్తి మరియు సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరమని అభిప్రాయం వ్యక్తం చేసింది.