కరోనా ప్రపంచాన్నే గడగడలాడిస్తుంది. ప్రపంచ వ్యాప్త ప్రజలందరూ కరోనా గురించి ఆందోళన పడుతున్నారు. మనదేశంలో అయితే కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. వేలకొద్దీ కేసులు బయటపడుతున్నాయి. పట్టణాల నుండి టౌన్లలోకి, టౌన్ల నుండి గ్రామాల్లోకి విస్తరించిన కరోనా వైరస్, దాని పరిధి పెంచుకుంటూ వెళ్తుంది. నిన్న ఒక్కరోజే మనదేశంలో 78,761 కేసులు బయటపడ్డాయి. అలాగే రికవరీ రేటు కూడా బాగానే పెరుగుతుంది.
అటు రికవరీ రేటు పెరుగుతూనే ఉన్నా కరోనా చావులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కరోనా చావుల్లో ఇండియా మూడవ స్థానంలో నిలిచింది. 63,498 మంది చనిపోవడంతో మెక్సికోని వెనక్కి నెట్టి మూడవ స్థానంలోకి వెళ్ళింది. ఈ విషయంలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది. ఇప్పటివరకు 35,42000మంది కరోనా బారిన పడగా, 27లక్షల మంది దాన్నుండి రికవరీ అయ్యారు. ప్రస్తుతం 7లక్షల మంది కరోనాతో పోరాడుతున్నారు.